నార్త్ ఈస్టర్న్ ఇందిరా గాంధీ రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ & మెడికల్ సైన్సెస్ , షిల్లాంగ్ సంస్థ నుండి నర్సింగ్ ఆఫీసర్ , స్టోర్ కీపర్ , రేడియోగ్రాఫర్ , మెడికల్ సోషల్ వర్కర్ , టెక్నీషియన్ ఎండోస్కోప్/ కాలనీస్కోపీ/ టెక్నీషియన్ ( న్యూక్లియర్ మెడిసిన్) , హెల్త్ ఇన్స్పెక్టర్ , జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ , జూనియర్ ఇంజనీర్( ఎలక్ట్రికల్) , ఫార్మాసిస్ట్, టెక్నికల్ అసిస్టెంట్, ECG టెక్నీషియన్, శానిటరీ ఇన్స్పెక్టర్, సెక్యూరిటీ గార్డు, రికార్డు క్లర్క్, డ్రైవర్ గ్రేడ్ – 3, డార్క్ రూం అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 130 ఉద్యోగాలను భర్తీ చేస్తుండగా , ఇందులో ఎక్కువగా 105 నర్సింగ్ ఆఫీసర్ భర్తీ చేస్తున్నారు.
ఈ నోటిఫికేషన్ లో ఎక్కువగా నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు కలవు
ఈ ఉద్యోగాల కి సంబందించి దరఖాస్తు చేయు విధానం, ఎంపిక విధానం, విద్యార్హతలు, జీతం వంటి అన్ని విషయాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
✅ మీ WhatsApp లేదా Telegram వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
నార్త్ ఈస్టర్న్ ఇందిరా గాంధీ రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ & మెడికల్ సైన్సెస్ , షిల్లాంగ్ సంస్థ నుండి ఈ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య:
అన్ని ఉద్యోగాలకు కలిపి 130 ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
నర్సింగ్ ఆఫీసర్ – 105
స్టోర్ కీపర్ – 3 (2-UR-PwBD& 1-OBC)
రేడియోగ్రాఫర్ – 3(2-UR- PwBD,1-SC)
మెడికల్ సోషల్ వర్కర్ – 1 (SC)
టెక్నీషియన్ ఎండోస్కోప్/ కాలనీస్కోపీ – 2 (UR)
టెక్నీషియన్ (న్యూక్లియర్ మెడిసిన్) – 4 (3-UR & 1-OBC)
హెల్త్ ఇన్స్పెక్టర్ – 1 (UR- PwBD)
జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ – 01 (UR)
జూనియర్ ఇంజనీర్( ఎలక్ట్రికల్) – 1 ( OBC కేటగిరీ)
ఫార్మాసిస్ట్ – 1 (ST కేటగిరీ)
టెక్నికల్ అసిస్టెంట్ – 1 (ST కేటగిరీ)
ECG టెక్నీషియన్ – 1 (ST కేటగిరీ)
శానిటరీ ఇన్స్పెక్టర్ – 2 ( ST,UR కేటగిరీ)
సెక్యూరిటీ గార్డు – 1 (UR కేటగిరీ)
రికార్డు క్లర్క్ – 1 (EWS కేటగిరీ)
డ్రైవర్ గ్రేడ్ 3 – 1 (EWS కేటగిరీ)
డార్క్ రూం అసిస్టెంట్ – 01 (EWS కేటగిరీ)
🔥 విద్యార్హత :
నర్సింగ్ ఆఫీసర్:
ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ / స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ నందు గుర్తింపు పొందిన సంస్థ / యూనివర్సిటీ నుండి బి. ఎస్సీ నర్సింగ్ లేదా తత్సమాన అర్హత కలిగి వుండాలి.
(లేదా)
జనరల్ నర్సింగ్ మిడ్ వైఫరీ లో డిప్లొమా ఉత్తీర్ణత సాధించి, 50 పడకల హాస్పిటల్ లో 2 సంవత్సరాలు పనిచేసిన అనుభవం అవసరం.
ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ / స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ నర్సెస్ & మిడ్ వైఫరీ గా రిజిస్టర్ అయి వుండాలి.
మిగతా ఉద్యోగాలకు సంబంధిత విభాగంలో డిగ్రీ , ఇంటర్మీడియట్ , డిప్లొమా , 10 వ తరగతి ఉత్తీర్ణత వంటి విద్యార్హతలు అవసరం.
🔥 వయస్సు :
ఫార్మాసిస్ట్ ఉద్యోగాలకి 27 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
మెడికల్ సోషల్ వర్కర్ ఉద్యోగానికి 35 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు
నోటిఫికేషన్ లో ప్రస్తావించిన మిగతా అన్ని ఉద్యోగాలకు కూడా 30 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎస్సీ , ఎస్టీ , ఓబీసీ అభ్యర్థులకు ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు వయోసడలింపు కలదు.
🔥దరఖాస్తు విధానం :
అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవలెను.
🔥 అప్లికేషన్ ఫీజు:
జనరల్ / ఓబీసి అభ్యర్థులు 500/- రూపాయలు & ఎస్సీ, ఎస్టీ, EWS అభ్యర్థులు 250/- రూపాయలు దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
దివ్యాంగులు కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
🔥 ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కు ఆన్లైన్ పరీక్ష / వ్రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 జీతం:
నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగానికి లెవెల్ – 07 పే స్కేల్ ఆధారిత జీతం లభిస్తుంది.
స్టోర్ కీపర్ , రేడియోగ్రాఫర్ , మెడికల్ సోషల్ వర్కర్ , టెక్నీషియన్ ఎండోస్కోప్/ కాలనీస్కోపీ/ టెక్నీషియన్ ( న్యూక్లియర్ మెడిసిన్) , హెల్త్ ఇన్స్పెక్టర్ , జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ , జూనియర్ ఇంజనీర్( ఎలక్ట్రికల్) ఉద్యోగాలకు లెవెల్ – 06 పే స్కేల్ ఆధారిత జీతం లభిస్తుంది.
ఫార్మాసిస్ట్, టెక్నికల్ అసిస్టెంట్, ECG టెక్నీషియన్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి లెవెల్ – 05 పే స్కేల్ ఆధారిత జీతం లభిస్తుంది.
సెక్యూరిటీ గార్డు, రికార్డు క్లర్క్, డ్రైవర్ గ్రేడ్ – 3, డార్క్ రూం అసిస్టెంట్ ఉద్యోగానికి లెవెల్ – 02 పే స్కేల్ ఆధారిత జీతం లభిస్తుంది.
🔥 ముఖ్యమైన తేదిలు:
ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది: 22/03/2025
ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది: 20/04/2025.
👉 Click here to download notification
👉 Click here for official website