భారత ప్రభుత్వం , మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్ పరిధిలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) సంస్ధ నుండి ఇన్స్పెక్టర్ , సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా 94 ఇన్స్పెక్టర్ ఉద్యోగాలను మరియు 29 సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి విద్యార్హతలు , దరఖాస్తు విధానం , ఎంపిక విధానం మొదలగు అన్ని అంశాలు కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ( NCB) సంస్థ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
మొత్తం 123 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
ఇన్స్పెక్టర్ – 94
సబ్ ఇన్స్పెక్టర్ – 29
🔥 విద్యార్హత :
ఉద్యోగాలకు సంబంధించి విద్యార్హతలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
ఇన్స్పెక్టర్:
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ / సంస్థ నుండి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి వుండాలి.
సాధారణ చట్టాల అమలు మరియు వాటిపై మేధస్సు సేకరణలో మూడు సంవత్సరాల అనుభవం కలిగి వుండాలి.
సబ్ ఇన్స్పెక్టర్:
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ / సంస్థ నుండి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి వుండాలి.
సాధారణ చట్టాల అమలు మరియు వాటిపై మేధస్సు సేకరణలో రెండు సంవత్సరాల అనుభవం కలిగి వుండాలి.
🔥 వయస్సు :
56 సంవత్సరాల లోపు వయస్సు గల వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు వయొసదలింపు కలదు.
🔥దరఖాస్తు విధానం :
అభ్యర్థులు ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
నోటిఫికేషన్ లో ప్రస్తావించిన దరఖాస్తు ఫారం ను నింపి, సంబంధిత ధ్రువపత్రాలు తో ఆఫీస్ వారి చిరునామా కు పంపించాలి.
🔥 దరఖాస్తు పంపవలసిన చిరునామా:
Deputy director general (P&A), Narcotics Control Bureau , West block No.1 , Wing No.5, RK Puram , New Delhi – 110066.
🔥 ఎంపికా విధానం:
అభ్యర్థులను సంబంధిత విద్యార్హత విభాగంలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥జీతం :
ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారికి లెవెల్ -7 పే స్కేల్ & సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు ఎంపిక కాబడిన వారికి లెవెల్ -6 పే స్కేల్ క్రింద జీతం లభిస్తుంది.
🔥 ముఖ్యమైన తేదిలు:
ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది : 07/03/2025
ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది : నోటిఫికేషన్ విడుదల అయిన 60 రోజుల లోపు.
👉 Click here for Inspector Notification – Click here
👉 Click here for Sub inspector Notification – Click here
,