MHSRB Lab Technician Selection List Download : తెలంగాణ రాష్ట్రంలో ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాల రిక్రూట్మెంట్ ప్రక్రియలో భాగంగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఈరోజు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గారు మెడికల్ బోర్డు అధికారులతో కలిసి విడుదల చేయడం జరిగింది. మొత్తం 1260 నందిని ఎంపిక చేస్తూ ఎంపిక జాబితా విడుదల చేశారు.

MHSRB Lab Technician Grade – 2 Recruitment :
- 2024లో సెప్టెంబర్ 11వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది.
- ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1284 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరారు. భర్తీ చేపట్టినటువంటి పోస్టుల్లో DPH / DME లో 1088 పోస్టులు, TVVP లో 183 పోస్టులు, MNJIO&RCC లో 13 పోస్టులు ఉన్నాయి.
- ఈ ఉద్యోగాలకు 24,045 మంది అభ్యర్థులు అప్లై చేశారు. 10-11-2024 వ తేదీన నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత పరీక్షకు 23,323 అభ్యర్థులు హాజరయ్యారు.
- ప్రస్తుతం 1260 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల యొక్క జాబితాను విడుదల చేయడం జరిగింది.
- గౌరవ హైకోర్టు ఆదేశాల మేరకు నాలుగు పోస్టులను ఖాళీగా ఉంచారు. హీరింగ్ హ్యాండీక్యాప్డ్ కోటాలో అభ్యర్థులు లేకపోవడం వల్ల రెండు పోస్టులు భర్తీ చేయలేదు. క్రీడల కోటాలో భర్తీ చేయాల్సిన 18 పోస్టులకు సంబంధించిన ఎంపిక జాబితా తర్వాత విడుదల చేస్తారు.
- ప్రస్తుతం ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు భర్తీ చేయడం వల్ల టీచింగ్ హాస్పిటల్స్, డిస్ట్రిక్ట్ లేదా ఏరియా హాస్పిటల్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్, MNJ క్యాన్సర్ హాస్పిటల్ లో లాబరేటరీ సర్వీసెస్ మెరుగవుతాయి.
✅ Download Selected Candidates List – Click here
