LIC Golden Jubilee Scholarship Scheme 2025 | LIC Scholarship 2025

LIC Golden Jubilee Scholarship Application Link
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

LIC Golden Jubilee Scholarship Scheme 2025 Application form : భారత ప్రభుత్వ యాజమాన్యంలో గల ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీం – 2025 ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కులాల వారికి స్కాలర్షిప్ లను అందిస్తుంది. ఈ విద్యా సంవత్సరం లో మొత్తం 11,200/- మంది విద్యార్థులకు స్కాలర్ షిప్ లభిస్తుంది.

ఈ గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ పథకం నందు రెండు విభాగాలు కలవు. అవి :

1. జనరల్ స్కాలర్షిప్ మరియు

2. బాలికల కొరకు ప్రత్యేక స్కాలర్షిప్

ఉన్నత విద్యను అభ్యసించేందుకు గాను అందించే ఈ స్కాలర్షిప్ పథకానికి సంబంధించి పూర్తి వివరాలు అనగా ఈ స్కాలర్షిప్ పథకానికి ఎవరు అర్హులు ? స్కాలర్షిప్ ఎంత లభిస్తుంది ? స్కాలర్షిప్ పొందేందుకు గాను ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ? స్కాలర్షిప్ ను ఏ విధంగా అందిస్తారు వంటి వివిధ అంశాల సమగ్ర విశ్లేషణ కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.

13,217 ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం – Click here

🔥 LIC Golden Jubilee Scholarship is Offered by :

  • లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీం – 2025 ను విద్యార్థులకు అందిస్తుంది.

🔥Who is Eligible for LIC Golden Jubilee Scholarship :

  • ఆర్థికంగా బలహీనపడిన వర్గాలు ( Economically weaker section – EWS ) లలో గల విద్యార్థులు ఈ స్కాలర్షిప్ పథకానికి అర్హత కలిగి ఉంటారు.

🔥 Objective of LIC Golden Jubilee Scholarship Scheme‌ :

  • ఆర్థికంగా వెనకబడిన వర్గాలలో గల ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉన్నత విద్య మరియు ఉపాధి కల్పించేందుకు గాను , వారికి మెరుగైన అవకాశాలను అందించేందుకు గాను ఈ స్కాలర్షిప్ పథకం యొక్క ప్రధాన లక్ష్యం.

✅ AP నిరుద్యోగులకు Work From Home Jobs – Click here

🔥 This LIC Golden Jubilee Scholarship Scheme is applicable to which eligible students from EWS categories? :

  • ఈ స్కాలర్షిప్ పథకం భారతదేశంలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యాసంస్థలలో విద్యను అభ్యసిస్తున్న అందరి విద్యార్థులకు వర్తిస్తుంది.
  • అలానే NCVT అనుబంధంగా ఉన్న ITI మరియు ITC సెంటర్లలో సాంకేతిక విద్య అభ్యసిస్తున్న వారికి & 12వ తరగతి తర్వాత ఇంటిగ్రేటెడ్ కోర్సులు చదువుతున్న వారికి కూడా వర్తిస్తుంది.

🔥‌ LIC Golden Jubilee Scholarship Qualification :

ఈ క్రింది పేర్కొన్న ప్రమాణాలు కు అనుగుణంగా ఉన్న విద్యార్థులు ఈ స్కాలర్షిప్ పొందేందుకు అవకాశం ఉంటుంది.

A) జనరల్ స్కాలర్ షిప్ :

a) ఇంటర్మీడియట్ / ఐటిఐ / డిప్లొమా తర్వాత :

  • 2022 – 23 / 2023 – 24 / 2024 – 25 విద్యా సంవత్సరం లో ఇంటర్మీడియట్ ( రెగ్యులర్ / ఒకేషనల్ ) / ఐటిఐ / డిప్లొమా , తత్సమాన అర్హత ను 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.
  • అలానే 2025 – 26 విద్యా సంవత్సరంలో గుర్తింపు పొందిన సంస్థ నుండి మెడిసిన్ ( MBBS , BAMS , BHMS, BDS ) , ఇంజనీరింగ్ ( B.E / B.tech / B.Arch ) , ఏదైనా డిగ్రీ , ఇంటిగ్రేటెడ్ కోర్సులు , డిప్లమా కోర్సులు , ఒకేషనల్ కోర్సులు ,ఐటిఐ కోర్సులలో అడ్మిషన్ తీసుకుని ఉండాలి.
  • తల్లిదండ్రులు / సంరక్షకుల యొక్క ఆదాయ పరిమితి సంవత్సరానికి 4,50,000 రూపాయల లోపు ఉండాలి.

b) 10వ తరగతి తర్వాత :

  • 2022 – 23 / 2023 – 24 / 2024 – 25 విద్యా సంవత్సరం లో పదవ తరగతి లేదా తత్సమాన అర్హత నందు ఉత్తీర్ణత సాధించాలి .
  • 2025 – 26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి ఒకేషనల్ /డిప్లమా కోర్సులు / ఐటిఐ కోర్సు నందు మొదటి సంవత్సరం అడ్మిషన్ తీసుకుని ఉండాలి.
  • తల్లిదండ్రులు / సంరక్షకుల యొక్క ఆదాయ పరిమితి సంవత్సరానికి 4,50,000 రూపాయల లోపు ఉండాలి.

B) బాలికలకు ప్రత్యేక స్కాలర్షిప్ ( రెండు సంవత్సరాలు ) :

  • 2022 – 23 / 2023 – 24 / 2024 – 25 విద్యా సంవత్సరం లో పదవ తరగతి లేదా తత్సమాన అర్హత నందు ఉత్తీర్ణత సాధించాలి .
  • 2025 – 26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి ఒకేషనల్ / ఇంటర్మీడియట్ (10 + 2) / డిప్లమా కోర్సులు / ఐటిఐ కోర్సు నందు మొదటి సంవత్సరం అడ్మిషన్ తీసుకుని ఉండాలి.
  • తల్లిదండ్రులు / సంరక్షకుల యొక్క ఆదాయ పరిమితి సంవత్సరానికి 4,50,000 రూపాయల లోపు ఉండాలి.

🔥 స్కాలర్షిప్ కాలపరిమితి :

  • ఈ స్కాలర్షిప్ కు ఎంపిక కాబడిన వారికి కోర్స్ యొక్క మొత్తం కాలానికి ( ఇంటర్న్షిప్ / స్టైఫండరీ పీరియడ్ ) జనరల్ స్కాలర్షిప్ క్రింద స్కాలర్షిప్ ను అందిస్తారు.
  • స్పెషల్ గర్ల్ స్కాలర్షిప్ కింద రెండు సంవత్సరాలు స్కాలర్షిప్ లభిస్తుంది.
  • విద్యార్థులు అర్హత కలిగి ఉండి , నిబంధనలకు అనుగుణంగా విద్యను అభ్యసిస్తే స్కాలర్షిప్ పునరుద్ధరించబడుతుంది.

🔥 లభించే స్కాలర్షిప్ మొత్తం :

A) జనరల్ స్కాలర్ షిప్ :

  • మెడిసిన్ విభాగంలో ఉన్నత చదువులు చదువుతున్న వారికి సంవత్సరానికి 40,000 లభిస్తుంది. ( 20వేల రూపాయలు చొప్పున రెండు విడతల్లో )
  • ఇంజనీరింగ్ విభాగంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వారికి సంవత్సరానికి 30 వేల రూపాయలు లభిస్తుంది. ( 15వేల రూపాయలు చొప్పున రెండు విడతల్లో )
  • ఏదైనా విభాగంలో డిగ్రీ , ఇంటిగ్రేటెడ్ కోర్సులు , డిప్లమో కోర్సులు , ఒకేషనల్ కోర్సులు , ఐటిఐ కోర్సులు అభ్యసిస్తున్న వారికి సంవత్సరానికి 20వేల రూపాయలు లభిస్తుంది. ( పదివేల రూపాయలు చొప్పున రెండు విడతలలో )

B) బాలికలకు ప్రత్యేక స్కాలర్షిప్ :

  • ఈ స్కాలర్షిప్ కు ఎంపిక కాబడిన వారికి సంవత్సరానికి ₹15 వేల రూపాయలు మొత్తం 30,000 లభిస్తుంది. ( ఇందులో భాగంగా సంవత్సరానికి 15000 రూపాయలు చొప్పున ( 7500 * 2 ) అందజేస్తారు.

🔥 దరఖాస్తు చేయు విధానం :

  • అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.

🔥 స్కాలర్ షిప్ ఎంపిక విధానం – ఇతర ముఖ్యాంశాలు :

  • ఈ స్కాలర్‌షిప్‌ పీజీ (Post-Graduation) చదువులకు వర్తించదు.
  • అభ్యర్థులు 10వ లేదా 12వ తరగతిలో కనీసం 60% మార్కులు (లేదా సమానమైన CGPA) సాధించి ఉండాలి. వారి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం ₹4,50,000 లోపు ఉండాలి.
    • ఆదాయం ₹0–₹2,50,000 మధ్య ఉండే వారికి మొదట ప్రాధాన్యత.
    • అవసరమైతే ₹2,50,001–₹4,50,000 మధ్య వారికీ ఎంపిక ఉంటుంది.
  • ఎంపిక విధానం: 10వ/12వ తరగతిలో పొందిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
    • 12వ తరగతి తర్వాత దరఖాస్తు చేసినవారికి ముందుగా ప్రాధాన్యత ఉంటుంది.
  • ఒకే మార్కులు వచ్చినప్పుడు తక్కువ ఆదాయం ఉన్నవారికి మొదటి ప్రాధాన్యత ఉంటుంది.
  • మార్కులు, ఆదాయం రెండూ సమానం అయితే LIC అధికారుల ఆర్థిక అంచనాపై ఆధారపడి నిర్ణయం తీసుకుంటారు.
  • ఇతర ట్రస్ట్/సంస్థల నుండి స్కాలర్‌షిప్ తీసుకుంటున్నవారు అర్హులు కారు.
    • అయితే, రాష్ట్ర/కేంద్ర ప్రభుత్వ స్కాలర్‌షిప్ పొందుతున్నవారు అర్హులు.
  • డిప్లొమా తర్వాత ఇంజనీరింగ్‌లో లేటరల్ ఎంట్రీ వచ్చినవారు కూడా అర్హులు – కానీ 1st Year లో చేరాలి.
  • విద్యార్థి కొత్త స్ట్రీమ్‌కి మారితే, కొత్త స్ట్రీమ్ కాలం ఎక్కువైతే స్కాలర్‌షిప్‌ పాత కోర్సు కాలానికి మాత్రమే వర్తిస్తుంది.
  • రాత్రిపూట, పార్ట్ టైమ్, డిస్టెన్స్ (దూర విద్య) లేదా ఓపెన్ యూనివర్సిటీల కోర్సులు చదివేవారు స్కాలర్‌షిప్‌కు అర్హులు కావు.
  • సీఏ (CA), సీఏస్ (CS), ఐసీఎంఏఐ (ICMAI) వంటి సెల్ఫ్ స్టడీ కోర్సులకు స్కాలర్‌షిప్ వర్తించదు.
  • ‘Special Scholarship for Girl’ కు తక్కువ దరఖాస్తులు వస్తే, డిప్లొమా చదివే బాలికలు (10వ తరగతి తర్వాత) ఎంపికలోకి తీసుకుంటారు – అయితే స్కాలర్‌షిప్ రెండు సంవత్సరాల వరకే.
  • మెడికల్ లేదా ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌లలో స్కాలర్‌షిప్ కొనసాగించాలంటే, ప్రతి సంవత్సరం కనీసం 55% మార్కులు రావాలి. అన్ని సబ్జెక్టుల్లో పాస్ కావాలి.
  • ఇతర కోర్సుల్లో (Arts, Science, Commerce) స్కాలర్‌షిప్ కొనసాగించాలంటే, కనీసం 50% మార్కులు రావాలి. అన్ని సబ్జెక్టుల్లో పాస్ కావాలి.
  • ‘Special Scholarship for Girl’ కేటగిరీలో స్కాలర్‌షిప్ కొనసాగించాలంటే, కనీసం 50% మార్కులు రావాలి. అన్ని సబ్జెక్టుల్లో పాస్ కావాలి.
  • సాధారణంగా ఒక్క కుటుంబానికి ఒక్కరికి మాత్రమే స్కాలర్‌షిప్ ఇస్తారు.
    • ఇద్దరు బాలికలు అయినా , తాజాగా దరఖాస్తు చేసుకున్న వారు బాలిక అయితే మినహాయింపు లభిస్తుంది.
    • ఒకే కుటుంబంలో బాలిక , బాలురు దరఖాస్తు చేస్తే అందులో బాలికకు ప్రాధాన్యత ఇస్తారు.
  • స్కాలర్‌షిప్ కొనసాగించాలంటే, విద్యార్థి తరగతులకు హాజరవుతూ ఉండాలి – స్కూల్/కాలేజీ నుండి ధృవీకరణ అవసరం.
  • ఆదాయ ధృవీకరణ పత్రం తహసీల్దార్, డిప్యూటీ కలెక్టర్, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ వంటి అధికారుల ద్వారా జారీ చేయాలి.
  • క్లెయిమ్ సంబంధించిన విద్యా సంవత్సరం ముగిసిన తర్వాత 12 నెలల కంటే ఎక్కువ సమయం తర్వాత స్కాలర్‌షిప్ బకాయిల క్లెయిమ్‌లు సమర్పించబడవు.
  • నిబంధనలు ఉల్లంఘిస్తే లేదా తప్పు చేస్తే స్కాలర్‌షిప్ రద్దవుతుంది.
  • నకిలీ పత్రాలు సమర్పిస్తే స్కాలర్‌షిప్ రద్దవుతుంది. ఇప్పటి వరకు చెల్లించిన మొత్తం తిరిగి వసూలు చేస్తారు.
  • LIC యొక్క 112 డివిజనల్ ఆఫీసులు ఒక్కొక్కటి 100 మందిని ఎంపిక చేస్తాయి.
    • ఇందులో 40 అబ్బాయిలకు, 40 అమ్మాయిలకు జనరల్ స్కాలర్‌షిప్.
    • మిగిలిన 20 అమ్మాయిలకి Special Girl Child Scholarship ఇవ్వబడుతుంది.
    • ఎంపికలో బాలుర సంఖ్యలో తగ్గుదల ఉంటే, ఆ లోటును బాలికలు భర్తీ చేయవచ్చు.
  • Special Girl Child Scholarship కింద మిగిలిన 20 స్కాలర్‌షిప్‌లు మాత్రమే అమ్మాయిలకు ఇస్తారు.
  • ఎంపిక ప్రక్రియ LIC డివిజనల్ స్థాయిలో జరుగుతుంది. తుది నిర్ణయం డివిజనల్ మేనేజర్‌కు ఉంటుంది.
  • ఎంపికైన విద్యార్థులకు LIC డివిజనల్ ఆఫీసు ఈమెయిల్ ద్వారా సమాచారం ఇస్తుంది.
  • కొంతమంది డివిజన్లు పూర్తి కోటాను ఎంపిక చేసిన తర్వాత వెయిటింగ్ లిస్ట్ నుండి కూడా విద్యార్థులను తీసుకోవచ్చు. ఇది Centralised Ranking ఆధారంగా ఉంటుంది.
  • ఏవైనా వివాదాలు, అనుమానాలు, సమస్యలు తలెత్తినప్పుడు – LIC GJF ఫౌండేషన్ నిర్ణయం తుది నిర్ణయం గా ఉంటుంది.

🔥 ముఖ్యమైన తేదీలు :

  • ఈ స్కాలర్షిప్ నాకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 22/09/2025

👉 Click here for official information

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *