డిగ్రీ అర్హతతో 1000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం | Latest Government Jobs | CBI Recruitment 2025 | Bank Jobs

డిగ్రీ చదివి బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేయాలి అనుకునే వారికి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. 1000 క్రెడిట్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుంచి ఆన్లైన్ విధానములో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దరఖాస్తులు కోరుతుంది. 

అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్లై చేసిన అభ్యర్థులకు తమ సొంత రాష్ట్రాల్లోనే పరీక్ష నిర్వహిస్తారు.

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన క్రెడిట్ ఆఫీసర్ ఉద్యోగాల నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే అప్లికేషన్ తప్పనిసరిగా పెట్టుకోండి. 

▶️ AP హైకోర్టులో ఉద్యోగాలు – Click here 

✅ ప్రతీ రోజూ ప్రభుత్వ ఉద్యోగాల వివరాలు మీ మొబైల్ కు రావాలి అంటే మా Telegram / Whatsapp గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel  

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇  

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : 

  • సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : 

  • ఈ నోటిఫికేషన్ ద్వారా క్రెడిట్ ఆఫీసర్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

🔥 భర్తీ చేస్తున్న పోస్టుల సంఖ్య : 

  • ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1000 పోస్టులు భర్తీ చేస్తున్నారు. 

🏹 ఇంటర్ అర్హతతో గవర్నమెంట్ ఉద్యోగాలు – Click here 

🔥 విద్యార్హతలు : 

  • ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ పెట్టుకోవచ్చు.

🔥 అప్లికేషన్ ఫీజు :

  • ఎస్సీ, ఎస్టీ, PWD మరియు మహిళలకు అప్లికేషన్ ఫీజు – 150/-
  • మిగతా వారికి అప్లికేషన్ ఫీజు 750/-

🔥 అప్లికేషన్ ముఖ్యమైన తేదీలు : 

  • అర్హత ఉండే అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు జనవరి 30వ తేదీ నుండి ఫిబ్రవరి 20వ తేదీలోపు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుంది.

🔥 పరీక్ష తేదీ వివరాలు : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేసిన అభ్యర్థులకు పరీక్షా తేదీ మరియు హాల్ టికెట్ డౌన్లోడ్ తేదీలు అధికారిక వెబ్సైట్ ద్వారా తర్వాత వెల్లడిస్తారు.

🔥 జీతము వివరాలు : 

  • Basic : 48480-2000/7-62480-2340/2-67160-2680/7-85920 పే స్కేల్ ప్రకారం ఈ ఉద్యోగాలకు జీతం ఇస్తారు.

🔥 వయస్సు వివరాలు : 

  • 20 నుండి 30 సంవత్సరాలు మధ్య వయస్సు ఉండాలి. (30-11-1994 నుండి 30-11-2004 మధ్య పుట్టిన తేదీ ఉన్న వారు అర్హులు)

🔥 వయసులో సడలింపు వివరాలు : 

  • ప్రభుత్వ నిబంధనల ప్రకారం అభ్యర్థులకు వయస్సులో సడలింపు వర్తిస్తుంది. అనగా
  • ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది. 
  • ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది.
  • PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది.

🔥 ఎంపిక విధానం : 

  • అప్లై చేసిన అభ్యర్థులను ఆన్లైన్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు పరీక్షను విజయవాడ / గుంటూరు, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్ లలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు నిర్వహిస్తారు.

🏹 Note : 

  • ఈ పోస్టులకు అప్లై చేయాలీ అనుకునే అభ్యర్థులు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని అప్లై చేయండి.

🏹 Download Notification – Click here 

🏹 Apply Online – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!