కాకినాడ సహకార టౌన్ బ్యాంకులో ఉద్యోగాలు | Kakinada Co Operative Town Bank Ltd Clerk cum Cashier Notification 2025

Kakinada Co Operative Town Bank Notification 2025
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Kakinada Co Operative Town Bank Ltd Clerk cum Cashier Recruitment 2025 : ది కాకినాడ కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ ( KCTB ) సంస్థ నుండి క్లర్క్ కం క్యాషియర్ ఉద్యోగాల భక్తీ కొరకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 11 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు , ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకునే ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు అనగా ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ? దరఖాస్తు చేసుకోవడానికి అవసరమగు విద్యార్హత ఏమిటి ? ఎంపిక విధానం ఎలా ఉంటుంది ? దరఖాస్తు ఫీజు ఎంత చెల్లించాలి ? జీతం ఎంత లభిస్తుంది వంటి వివిధ అంశాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.

RBI లో ఉద్యోగాలు – Click here

🔥 Kakinada Co Operative Town Bank Ltd Clerk cum Cashier Notification Released by the Company :

  • ది కాకినాడ కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ సంస్థ నుండి ఈ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయింది.

🔥 Kakinada Co Operative Town Bank Recruitment :

  • సంబంధిత బ్యాంకులో క్లర్క్ కం క్యాషియర్ గా పనిచేసేందుకు గాను ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాల సంఖ్య :

  • మొత్తం 11 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
  • క్యాటగిరిల వారీగా ఖాళీల సంఖ్య ఈ విధంగా ఉంది.
  • SC : 02
  • BC – B : 02
  • BC – D : 02
  • BC – E : 01
  • OC : 04

🔥 వయోపరిమితి :

  • 34 సంవత్సరాల వయస్సు లోపు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • వయస్సు నిర్ధారణ కొరకు 18/08/2025 ను కట్ ఆఫ్ తేదీగా నిర్ణయించారు.
  • బీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు , ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు & బ్యాంకింగ్ మరియు ఫైనాన్సు రంగంలో అనుభవం కలిగి ఉన్న అభ్యర్థులకు గరిష్టంగా ఆరు సంవత్సరాలు వయో సడలింపు లభిస్తుంది.

🔥 విద్యార్హతలు :

  • ఏదైనా విభాగం నుండి సాధారణ డిగ్రీ కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఫైనాన్స్ మరియు బ్యాంకింగ్ విభాగంలో అనుభవం కలిగి అభ్యర్థులు ఏదైనా డిగ్రీ నందు కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఇంగ్లీష్ మరియు తెలుగు భాషలపై పరిజ్ఞానం కలిగి ఉండాలి.

🔥 దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

✅ IOCL లో 500 ఉద్యోగాలు – Click here

🔥 దరఖాస్తు ఫీజు :

  • ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకుగాను అభ్యర్థులు దరఖాస్తు ఫీజును ఆన్లైన్ విధానం లోనే చెల్లించాల్సి ఉంటుంది.
  • ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులు 250 రూపాయలు & ఓసి మరియు పిసి అభ్యర్థులు 500 రూపాయలు దరఖాస్తు ఫీజును ఆన్లైన్ విధానం ద్వారా చెల్లించాలి.

🔥 ఎంపిక విధానం :

  • ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష మరియు పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

🔥 జీతభత్యాలు :

  • ఈ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారికి రెండు సంవత్సరాలు ప్రొబేషన్ పీరియడ్ లో ఉండాల్సి ఉంటుంది.
  • ప్రొఫెషన్ పీరియడ్ లో మొదటి సంవత్సరం ప్రతి నెల 15 వేల రూపాయలు చొప్పున జీతం లభిస్తుంది.
  • ప్రొఫెషన్ పీరియడ్ లో రెండవ సంవత్సరం ప్రతి నెల 18 వేల రూపాయలు చొప్పున జీతం లభిస్తుంది.
  • ప్రొఫెషన్ పీరియడ్ పూర్తి కాబడిన తర్వాత వీరికి బ్యాంకు స్టాఫ్ సర్వీస్ కండిషన్స్ ఆధారంగా జీతంతో పాటుగా అన్ని అలవెన్సులు లభిస్తాయి.

🔥 ముఖ్యమైన తేదీలు :

  • నోటిఫికేషన్ విడుదల తేదీ : 20/08/2025
  • ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ : 01/09/2025
  • ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 26/09/2025
  • హాల్ టికెట్ లు విడుదల తేదీ ( తాత్కాలికం ) : 01/10/2025
  • వ్రాత పరీక్ష నిర్వహణ తేదీ ( తాత్కాలికం) : 12/10/2025

👉 Click here for notification

👉 Click here to apply

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *