కేంద్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన జవహర్ లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (JIPMER) లో 557 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు త్వరలో నోటిఫికేషన్ విడుదల కాబోతోంది.
ఇటీవల వైద్య , ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ 947 ఉద్యోగాలను పుదుచ్చేరిలో ఉన్న జవహర్ లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (JIPMER) లో భర్తీ చేసేందుకు అనుమతి కోరుతూ ప్రతిపాదనలు ఆర్థిక శాఖకు పంపించడం జరిగింది. అనుమతి కోరిన పోస్టుల్లో 557 పోస్టులను భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. అనుమతి ఇచ్చిన పోస్టుల్లో అత్యధికంగా నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. వీటితోపాటు ఇతర ఉద్యోగాలను భర్తీ చేసినందుకు తాజాగా అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ నియామక ప్రక్రియతో JIPMER తన వైద్య, నర్సింగ్, టెక్నికల్ సేవలను మరింత బలోపేతం చేసుకోనుంది. ఉద్యోగ అవకాశాలను ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది అద్భుత అవకాశంగా నిలవనుంది.
ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి ఏఏ పోస్టులు భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది అని వివరాలతో పాటు ముఖ్యమైన వివరాలన్నీ స్పష్టంగా తెలుసుకోండి.
🏹 రైల్వే గ్రూప్ డి ఆన్లైన్ కోచింగ్ మీకు 499/- కే కావాలి అంటే క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
✅ Download Our App – Click here
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
JIPMERలో కొత్తగా 557 ఉద్యోగాలు – కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన భారీ నియామకాలు
పుదుచ్చేరి లో ఉన్న జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (JIPMER) లో కేంద్ర ప్రభుత్వం కొత్తగా 557 ఉద్యోగాలను సృష్టించింది. పోస్టుల వివరాలు, ఖాళీలు, జీత స్థాయిలు మరియు నియామక విధానం గురించి పూర్తిగా తెలుగులో తెలుసుకోండి.
JIPMER లో కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన 557 కొత్త ఉద్యోగాలు :
కేంద్ర, ఆరోగ్య మంత్రిత్వ శాఖ (MoHFW) ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ (Department of Expenditure) ఆమోదం తెలిపింది.
మొత్తం 947 పోస్టులకు ప్రతిపాదన పంపగా, వాటిలో 557 పోస్టులకు ఆమోదం లభించింది.
JIPMER లో ఆమోదించబడిన ముఖ్యమైన పోస్టుల వివరాలు :
మొత్తం ఖాళీలు : 557
క్రమ.సంఖ్య | పోస్టు పేరు | జీతము స్థాయి (Pay Level) | ఖాళీలు |
1 | అసిస్టెంట్ ప్రొఫెసర్ | Level-12 | 36 |
2 | సీనియర్ రెసిడెంట్ | Level-11 | 50 |
3 | జూనియర్ రెసిడెంట్ | Level-10 | 01 |
4 | నర్సింగ్ ఆఫీసర్ | Level-7 | 400 |
5 | అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ | Level-8 | 3 |
6 | కంప్యూటర్ ప్రోగ్రామర్ | Level-10 | 2 |
7 | స్టోర్ కీపర్ | Level-4 | 6 |
8 | మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్ | Level-6 | 18 |
9 | ఫార్మసిస్ట్ | Level-5 | 2 |
10 | లైబ్రరీ అసిస్టెంట్ | Level-6 | 2 |
👩⚕️ JIPMER లో విభాగాల వారీగా పోస్టులు:
- వైద్య విభాగం (Doctors & Residents)
- నర్సింగ్ విభాగం (Nursing Officers)
- టెక్నికల్ విభాగం (Lab Tech, Radiology, Physiotherapy)
- అడ్మినిస్ట్రేటివ్ విభాగం
- లాబ్రరీ & ఫార్మసీ విభాగాలు
JIPMER ఉద్యోగాల జీతాలు & లెవెల్స్ :
పోస్టులు వారీగా జీతము స్థాయిలు Pay Level 2 నుండి Level 13 వరకు ఉన్నాయి. ఇది పోస్టులను అనుసరించి అనుభవం మరియు అర్హతను బట్టి మారుతుంది.
JIPMER ఉద్యోగాల నియామక విధానం :
- ఉద్యోగాలు రెగ్యులర్ పద్ధతిలో భర్తీ చేయబడతాయి.
- Recruitment Rules ప్రకారం నియామక ప్రక్రియ జరుగుతుంది.
- 521 గ్రూప్-డి పోస్టులు భవిష్యత్తులో పూర్తిగా ఔట్సోర్సింగ్ ద్వారా భర్తీ చేయనున్నారు.
✅ Download vacancies PDF – Click here