ISRO SDSC Notification 2025 | ISRO SDSC SHAR Notification 2025

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

భారత ప్రభుత్వం , డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ యొక్క ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ పరిధిలోగల సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SHAR ) , శ్రీహరికోట , తిరుపతి జిల్లా నుండి వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్ విడుదల అయింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాలలో ఉద్యోగాలను శాశ్వత ప్రాధిపతికన భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఉద్యోగాలను పొందేందుకు అవకాశం లభిస్తుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే ఉద్యోగాల యొక్క పూర్తి వివరాలు అనగా ఏ ఏ పోస్టులను భర్తీ చేస్తున్నారు ? ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి? విద్యార్హతలు ఏమి ఉండాలి ? జీత భత్యాలు ఎంత లభిస్తాయి ? ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది? వంటి అన్ని అంశాల సమగ్ర సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

  • సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ సంస్థ నుండి ఈ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

🔥భర్తీ చేయబోయే ఉద్యోగాలు :

  • వివిధ కేటగిరీ లలో వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
  1. సైంటిస్ట్ / ఇంజనీర్ – 23
  2. టెక్నికల్ అసిస్టెంట్ – 28
  3. సైంటిఫిక్ అసిస్టెంట్ – 03
  4. లైబ్రరీ అసిస్టెంట్ – 01
  5. రేడియోగ్రాఫర్ – 01
  6. టెక్నీషియన్ – 60
  7. డ్రాఫ్ట్ మెన్ – 02
  8. కుక్ – 03
  9. ఫైర్ మాన్ – 06
  10. లైట్ వెహికల్ డ్రైవర్ – 03
  11. నర్స్ – 01

🔥 విద్యార్హత :

  • సైంటిస్ట్ / ఇంజనీర్ : 60 శాతం మార్కులు / 6.5 CGPA తో సంబంధిత విభాగంలో M.E/ M.Tech / M.Sc ( ఇంజనీరింగ్ ) లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.
  • టెక్నికల్ అసిస్టెంట్ : సంబంధిత విభాగంలో ఫస్ట్ క్లాస్ ఉత్తీర్ణత సాధించాలి.
  • సైంటిఫిక్ అసిస్టెంట్ : సంబంధిత విభాగం లో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • లైబ్రరీ అసిస్టెంట్: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి , లైబ్రరీ/ లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ సైన్స్ నందు మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి.
  • రేడియోగ్రాఫర్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి 2 సంవత్సరాల కి తక్కువ కాకుండా రేడియోగ్రఫీ నందు ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఉత్తీర్ణత సాధించాలి.
  • టెక్నీషియన్: 10 వ తరగతి ఉత్తీర్ణత సాధించి, సంబంధిత విభాగంలో ఐటిఐ పూర్తి చేసి ఉండాలి.
  • డ్రాఫ్ట్మెన్: 10 వ తరగతి ఉత్తీర్ణత సాధించి, డ్రాఫ్ట్ మెన్ సివిల్ ట్రేడ్ విభాగం లో ఐటిఐ ఉత్తీర్ణత సాధించాలి.
  • కుక్ : పదవ తరగతి ఉత్తీర్ణత సాధించి , ప్రముఖ హోటల్ / క్యాంటీన్ నందు 5 సంవత్సరాలు పని అనుభవం కలిగి ఉండాలి.
  • ఫైర్ మాన్ : పదవ తరగతి ఉత్తీర్ణత సాధించి , శారీరక సామర్ధ్యం కలిగి వుండాలి.
  • లైట్ వెహికల్ డ్రైవర్ : పదవ తరగతి ఉత్తీర్ణత సాధించి , valid LVD కలిగి డ్రైవర్ గా 3 సంవత్సరాలు పని అనుభవం కలిగి ఉండాలి.
  • నర్స్: గుర్తింపు పొందిన సంస్థ నుండి నర్స్ కోర్సు నందు కనీసం 3 సంవత్సరాల ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఉత్తీర్ణత సాధించాలి.

🔥 దరఖాస్తు చేయు విధానము :

  • అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు సమర్పించాలి.
  • 16/10/2025 నుండి 14/11/2025 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.

🔥 దరఖాస్తు ఫీజు :

  • అభ్యర్థులు ఆన్లైన్ విధాన ద్వారా ఫీజు చెల్లించవలసి ఉంటుంది. నోటిఫికేషన్ లో ప్రస్తావించిన కొన్ని పోస్ట్ లకు 750 మరియు కొన్ని ఉద్యోగాలకు 500 రూపాయలు దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
  • ఎస్సీ , ఎస్టీ , దివ్యాంగులకు , ఎక్స్ సర్వీస్ మెన్ వారికి పరీక్ష రాశాక పూర్తి రిఫండ్ లభిస్తుంది.

🔥 ఎంపిక విధానం :

  • పోస్ట్ లను అనుసరించి వ్రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ లను నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

🔥 పరీక్షా కేంద్రాలు :

  • సైంటిస్ట్ / ఇంజనీర్ పరీక్ష నిర్వహణ కొరకు చెన్నై , తిరువనంతపురం , బెంగుళూర్ , డెహ్రాడూన్ , గుంటూరు లలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.
  • మిగతా అన్ని ఉద్యోగాల కొరకు వివిధ రాష్ట్రాలలో ఉన్న పరీక్షా కేంద్రాలలో పాటుగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గల గుంటూరు , విశాఖపట్నం , తిరుపతి లలో పాటు గా తెలంగాణ రాష్ట్రం లో గల హైదరాబాద్ లలో నిర్వహిస్తారు.

🔥 ముఖ్యమైన తేదీలు :

  • ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 16/10/2025 ( ఉదయం 10:00 గంటల నుండి )
  • ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 14/11/2025 ( సాయంత్రం 05:00 గంటల లోగా )

👉 Click here for notification

👉 Click here to apply

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *