ISRO NRSC Notification 2025 | ISRO Latest Jobs Recruitment 2025

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ISRO NRSC Technical Assistant, Technician, Draughtsman Notification 2025 : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) కు చెందిన హైదరాబాదులో ఉన్న నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) నుండి వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేసినందుకు అర్హత ఉన్నవారి నుండి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది.. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న భారతీయ పౌరుల నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు.

ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు ఆన్లైన్ విధానంలో నవంబర్ 10వ తేదీ నుండి నవంబర్ 30వ తేదీలోపు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి..

రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

ఇస్రో సంస్థకు చెందిన హైదరాబాదులో ఉన్న నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ నుండి విడుదలైంది.

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నికల్ అసిస్టెంట్ (సివిల్), టెక్నికల్ అసిస్టెంట్ (ఆటో మొబైల్), టెక్నీషియన్ – B (Electronic mechanic), టెక్నీషియన్ – B (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ), టెక్నీషియన్ – B (ఎలక్ట్రికల్) , డ్రాఫ్ట్స్‌మన్-బి (సివిల్) అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు.

మొత్తం ఖాళీల సంఖ్య :

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 13 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

అప్లికేషన్ తేదీలు :

అర్హత ఉండేవారు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో నవంబర్ 10వ తేదీ నుండి నవంబర్ 30వ తేదీ లోపు అప్లై చేయాలి.

జీతము వివరాలు :

  • టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 70,942/- జీతంతో పాటు ఇతర అలవెన్సులు ఇస్తారు.
  • టెక్నీషియన్ – బి మరియు డ్రాఫ్ట్స్‌మన్-బి ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 34,286/- జీతంతో పాటు ఇతర అలవెన్సులు ఇస్తారు.

విద్యార్హత వివరాలు :

ఈ ఉద్యోగాలకు పోస్టులను అనుసరించి పదో తరగతి, ఐటిఐ, డిప్లొమా అర్హతలు ఉన్నవారు అప్లై చేయవచ్చు.

వయస్సు వివరాలు :

  • ఈ ఉద్యోగాలకు 18 నుండి 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారు అప్లై చేయడానికి అర్హులు.

వయస్సులో సడలింపు వివరాలు :

  • ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు వయస్సులో ఐదు సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
  • ఓబీసీ అభ్యర్థులకు వయసులో మూడేళ్లు సడలింపు ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు వివరాలు :

  • టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు 750/- రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. పరీక్ష రాసిన తర్వాత SC/ST/ PwBD and Ex-Servicemen అభ్యర్థులకు పూర్తి ఫీజు రిఫండ్ చేయడం జరుగుతుంది. మిగతా అభ్యర్థులకు 500/- రిఫండ్ ఇస్తారు.
  • టెక్నీషియన్ – బి మరియు డ్రాఫ్ట్స్‌మన్-బి ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు 500/- రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. పరీక్ష రాసిన తర్వాత SC/ST/ PwBD and Ex-Servicemen అభ్యర్థులకు పూర్తి ఫీజు రిఫండ్ చేస్తారు. మిగతా అభ్యర్థులకు 400/- రిఫండ్ ఇస్తారు.

ఎంపిక విధానం వివరాలు :

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న ప్రక్రియలో భాగంగా రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.

పరీక్షా కేంద్రాలు :

దేశవ్యాప్తంగా 25 పట్టణాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి పట్టణాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మరియు కరీంనగర్ పట్టణాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.

Download Notification – Click here

Apply Online – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *