భారతీయ రైల్వేలో టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Indian Railway Teacher Jobs Recruitment 2025 | Railway Jobs Recruitment 2025

నిరుద్యోగులకు శుభవార్త ! భారతీయ రైల్వే సంస్థలో టీచర్స్ గా పనిచేసేందుకు గాను అవకాశం కల్పిస్తూ, నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఇందు నిమిత్తం అర్హత కలిగిన అభ్యర్థులు కేవలం వాక్ ఇన్ ఇంటర్వ్యూ కి అటెండ్ అయితే సరిపోతుంది.

ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు ప్రాధిపతికన భర్తీ చేసేందుకు గాను నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి దరఖాస్తు విధానం,ఎంపికా విధానం మొదలగు అన్ని అంశాలు కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.

🏹 రైల్వేలో 9,900 ఉద్యోగాలు – Click here

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : 

  • ఇండియన్ రైల్వేస్, చిత్తరంజన్ లోకోమోటివ్స్ సంస్థ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :

  • మొత్తం 37 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
  • ఈ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారు  రైల్వే స్కూల్ – DV(గర్ల్స్), DV (బాయ్స్) & CHS(EM) / CLW / చిత్తరంజన్ వద్ద పనిచేయాల్సి వుంటుంది.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :

  • పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ (PGT) – 21
    1. PGT (ఫిజిక్స్)
    2. PGT (కెమిస్ట్రీ)
    3. PGT (మాథెమాటిక్స్)
    4. PGT (కంప్యూటర్)
    5. PGT (హింది)
    6. PGT (బెంగాలీ)
    7. PGT (హిస్టరీ)
    8. PGT (పొలిటికల్ సైన్స్)
    9. PGT (జాగ్రఫీ)
    10. PGT (ఎకానామిక్స్)
    11. PGT (కామర్స్)
  • ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(TGT) – 11
    1. TGT (ఇంగ్లీష్)
    2. TGT (బెంగాలీ)
    3. TGT (SST)
    4. TGT (ఫిజిక్స్.కెమిస్ట్రీ.బయాలజీ)
    5. TGT (ఫిజిక్స్.కెమిస్ట్రీ.మ్యాథ్స్)
    6. TGT(హిందీ)

🏹 పోస్టల్ డిపార్ట్మెంట్ లో సూపర్వైజర్ ఉద్యోగాలు – Click here 

🔥 విద్యార్హత :

  1. పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ (PGT):
  • సంబంధిత విభాగంలో 50 శాతం మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ  లేదా తత్సమాన అర్హత ఉత్తీర్ణత సాధించాలి.
  • B.Ed లేదా తత్సమాన అర్హత కలిగి వుండాలి.
  • సంబంధిత భాషా మీడియం లో బోధించగలిగే నైపుణ్యత కలిగి వుండాలి.
  1. ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(TGT):
  • సంబంధిత సబ్జెక్టు లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి , ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లో రెండు సంవత్సరాల డిప్లొమా ఉత్తీర్ణత సాధించాలి.

                (లేదా)

సంబంధిత విభాగంలో 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్/పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి , బి. ఎడ్ (B.Ed) ఉత్తీర్ణత సాధించాలి.

(లేదా)

నోటిఫికేషన్ లో ప్రస్తావించిన తత్సమాన అర్హత కలిగి వుండాలి.

🔥 వయస్సు :

  • 18 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
  • వయస్సు నిర్ధారణ కొరకు 20/03/2025 ను కట్ ఆఫ్ తేది గా నిర్ణయించారు.

🔥 ఎంపిక విధానం :

  • అభ్యర్థులు ఏప్రిల్ 2025 లో తేది: 5, 7, 8, 9, 11, 12 లలో ఉదయం 09:30 నిముషాలకు నిర్వహించే వాక్ ఇన్ ఇంటర్వ్యూ లకు హాజరు కావాలి.
  • అభ్యర్థులు ఇంటర్య్వూ కి హాజరు అయ్యేటప్పుడు విద్యార్హత, కుల ధ్రువీకరణ, ఇతర ధృవపత్రాల ఒరిజినల్ ను తీసుకొని వెళ్ళాలి. 

🔥 ఇంటర్వ్యూ నిర్వహించే వేదిక :

  • మీటింగ్ రూమ్ / జిఎం ఆఫీస్ బిల్డింగ్ / CLW / CR వద్ద నిర్వహిస్తారు.

🔥అవసరమగు ధృవపత్రాలు :

  1. అభ్యర్థులు ఇంటర్వ్యూ కి హాజరు అయ్యేటప్పుడు దరఖాస్తు ఫారం తో పాటు క్రింది ధృవపత్రాల జిరాక్స్ కాపీ లను కూడా తీసుకొని వెళ్ళాలి.
    1. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్
    2. కమ్యూనిటీ సర్టిఫికెట్
    3. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్
    4. రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు
    5. ఎక్సపీరియన్స్ సర్టిఫికెట్ ( వుంటే)
    6. ఐడెంటిటీ ప్రూఫ్ ( ఆధార్, పాన్,ఓటర్ ఐడి etc…)
    7. కేంద్ర లేదా రాష్ట్ర గెజిటెడ్ అధికారుల నుండి క్యారెక్టర్ మరియు అంటిసిడెంట్ సర్టిఫికెట్ 
    8. ఉద్యోగిగా చేస్తే వుంటే NOC సర్టిఫికెట్ 

🔥 జీతం :

  • PGT గా ఎంపిక కాబడిన వారికి నెలకు 27,500/- రూపాయలు మరియు TGT గా ఎంపిక కాబడిన వారికి 26,250/- రూపాయలు జీతం లభిస్తుంది.

 🔥 ముఖ్యమైన తేదిలు :

  • ఏప్రిల్ 2025 లో తేది : 5, 7, 8, 9, 11, 12 లలో ఉదయం 09:30 నిముషాలకు నిర్వహించే వాక్ ఇన్ ఇంటర్వ్యూ లకు హాజరు కావాలి.

👉  Click here for notification

👉 Click here for official website 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!