ఇండియన్ నేవీ సంస్థ నుండి అగ్నిపధ్ పథకంలో భాగంగా అగ్నివీర్ ఉద్యోగాల భర్తీ కొరకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తుల స్వీకరణ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ఈ ఉద్యోగాలకు దేశంలోని అవివాహితులు అయిన మహిళా మరియు పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి , అవసరమగు విద్యార్హతలు , దరఖాస్తు చేయు విధానం , ఎంపిక విధానం మొదలగు అన్ని అంశాలు ను పూర్తిగా తెలుసుకొనేందుకు గాను ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- ఇండియన్ నేవీ సంస్థ నుండి 02/2025 , 01/2026 & 02/2026 బ్యాచ్ నియామకాల కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- అగ్నిపద్ పథకం క్రింద అగ్నివీర్ వాయు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
🔥 విద్యార్హత :
- అభ్యర్థులు ఇంటర్మీడియట్ / 10+2 లేదా తత్సమాన అర్హత లో మాథెమాటిక్స్, ఫిజిక్స్ , సబ్జెక్టులను కలిగి వుండి కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి వుండాలి.
(లేదా)
- మెకానికల్ / ఎలక్ట్రికల్ / ఆటోమొబైల్స్ / కంప్యూటర్ సైన్స్/ ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / ఇంజనీరింగ్ విభాగంలో 3 సంవత్సరాల డిప్లొమా ను 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి వుండాలి.
(లేదా)
- రెండు సంవత్సరాల వొకేషనల్ కోర్సు లో , ఫిజిక్స్ మరియు మాథెమాటిక్స్ సబ్జెక్టు లలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి వుండాలి.
🔥 వయస్సు :
- అగ్నివీర్ 02/2025 బ్యాచ్: అభ్యర్థులు 01/సెప్టెంబర్ /2004 నుండి 29/ఫిబ్రవరి/2008 లోగా జన్మించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
- అగ్నివీర్ 01/2026 బ్యాచ్: అభ్యర్థులు 01/సెఫిబ్రవరి/2005 నుండి 31/జూలై/2008 లోగా జన్మించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
- అగ్నివీర్ 02/2026 బ్యాచ్: అభ్యర్థులు 01/జూలై/2005 నుండి 31/డిసెంబర్/2008 లోగా జన్మించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.
🔥 దరఖాస్తు ఫీజు :
- అభ్యర్థులు 550/- రూపాయలు + GST అప్లికేషన్ ఫీజు ను ఆన్లైన్ విధానం ద్వారా చెల్లించాలి.
🔥 ఎంపిక విధానం :
- అభ్యర్థులను స్టేజ్ – 1 , మరియు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ , స్టేజ్ – 2 వ్రాత పరీక్ష , మెడికల్ టెస్ట్ నిర్వహణ ద్వారా ఎంపిక చేస్తారు.
- స్టేజ్ – 1 పరిక్ష మే 25 న నిర్వహిస్తారు.
- పురుష , మహిళా అభ్యర్థులు కనీసం 152 సెంటీమీటర్ల ఎత్తు కలిగి వుండాలి.
- పురుష అభ్యర్థులు కనీసం 77 సెంటీమీటర్ల ఛాతి కలిగి వుండి, కనీసం 5 సెంటీమీటర్ల ఎక్సపెన్షన్ రావాలి.
- పూర్తి ఆరోగ్యవంతులు అయి వుండాలి.
🔥 స్టేజ్ – 1 వ్రాత పరీక్ష :
- మొత్తం వంద మార్కులకు గాను పరీక్ష నిర్వహిస్తారు.
- ఇంగ్లీష్ , సైన్స్,మాథెమాటిక్స్,జనరల్ అవేర్నెస్ సబ్జెక్ట్లపై ప్రశ్నలు వస్తాయి.
- ¼ వ వంతు నెగెటివ్ మార్కింగ్ విధానం కలదు.
- 10 + 2 సిలబస్ ఆధారంగా ప్రశ్నలు వస్తాయి.
🔥 ఫిజికల్ స్టాండర్డ్స్ & ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్:
- ఫిజికల్ స్టాండర్డ్స్ & ఫిట్నెస్ వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

🔥 స్టేజ్ – 2 వ్రాత పరీక్ష :
- స్టేజ్ – 1 వ్రాత పరీక్ష మరియు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉత్తీర్ణత సాధించిన వారికి స్టేజ్ – 2 వ్రాత పరీక్ష నిర్వహిస్తారు.
- ఇంగ్లీష్ , సైన్స్, మాథెమాటిక్స్, జనరల్ అవేర్నెస్ సబ్జెక్ట్లపై ప్రశ్నలు వస్తాయి.
- ¼ వ వంతు నెగెటివ్ మార్కింగ్ విధానం కలదు.
- 10 + 2 సిలబస్ ఆధారంగా ప్రశ్నలు వస్తాయి.
- ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు.
🔥 జీతం :
- ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి నెలకు
- మొదటి సంవత్సరం – 30,000/- రూపాయలు (నెలకు)
- రెండవ సంవత్సరం – 33,000/- రూపాయలు (నెలకు)
- మూడవ సంవత్సరం – 36,500/- రూపాయలు (నెలకు)
- నాల్గవ సంవత్సరం – 40,000/- రూపాయలు (నెలకు) చొప్పున జీతం లభిస్తుంది.
🔥 ముఖ్యమైన తేదిలు :
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేది : 29/03/2025.
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేయడానికి చివరి తేది : 10/04/2025.( 05:00 గంటల లోగా)
👉 Click here for official website