ఆదాయ పన్ను శాఖలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ట్యాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు భర్తీ | Income Tax Department Jobs Recruitment 2026

Income Tax Department Tax Assistent Jobs
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Income Tax Department Tax Assistent Notification 2026 : ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ లో స్టెనోగ్రాఫర్, ట్యాక్స్ అసిస్టెంట్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగి అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 97 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో జనవరి 7వ తేదీ నుండి జనవరి 31వ తేదీలోపు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

▶️ ఆధార్ సేవా కేంద్రాల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల – Click here

రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

భారత ప్రభుత్వ ఆదాయ పన్ను శాఖ నుండి ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :

క్రీడల కోటాలో ఈ ఉద్యోగాలను స్టెనోగ్రాఫర్, ట్యాక్స్ అసిస్టెంట్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

విద్యార్హతలు :

  • స్టెనో గ్రాఫర్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డు నుండి 12వ తరగతి అర్హత కలిగి వారు అర్హులు.
  • ట్యాక్స్ అసిస్టెంట్ ఉద్యోగాలకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ లేదా తత్సమానమైన విద్యార్హతలు ఉన్నవారు అర్హులు.
  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు పదో తరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉన్న వారు అర్హులు

మొత్తం ఖాళీల సంఖ్య :

ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ నుండి విడుదల అయిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 97 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

అప్లికేషన్ తేదీలు :

అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు జనవరి 7వ తేదీ నుండి జనవరి 31వ తేదీ లోపు అప్లై చేయాలి.

అప్లికేషన్ ఫీజు వివరాలు :

అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేసే సమయంలో 200/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

వయస్సు వివరాలు :

  • స్టెనోగ్రాఫర్, ట్యాక్స్ అసిస్టెంట్ ఉద్యోగాలకు వయస్సు 18 నుండి 27 సంవత్సరాలు మధ్య ఉన్న వారు అర్హులు.
  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు 18 నుండి 25 సంవత్సరాలు మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు.

వయస్సులో సడలింపు వివరాలు :

  • మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ కు వయస్సులో 5 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
  • SC / ST అభ్యర్థులకు వయస్సులో 10 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.

అప్లై విధానం వివరాలు :

అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి. ఆన్లైన్ లో అప్లై చేసే సమయంలో నోటిఫికేషన్ లో అడిగిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి.

Download Notification – Click here

▶️ Apply Online – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *