HPCL Junior Executive Jobs Notification 2025 Full Details :
మహారత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైస్ అయిన హిందూస్తాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ (HPCL) సంస్థ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ నిమిత్తం నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాలలో మొత్తం 103 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీ చేస్తున్నారు.
డిప్లొమా అర్హతతో, ఎటువంటి పని అనుభవం లేకుండానే ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి అవసరమగు విద్యార్హతలు & దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వంటి పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🏹 AP లో ఇంటర్ అర్హతతో రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు – Click here
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
హిందూస్తాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ (HPCL) సంస్థ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
103 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (మెకానికల్) – 11
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రికల్) – 17
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇన్స్ట్రుమెంటేషన్) – 06
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (కెమికల్) – 41
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఫైర్ & సేఫ్టీ) – 28
🔥 విద్యార్హత :
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (మెకానికల్ / ఎలక్ట్రికల్ / ఇన్స్ట్రుమెంటేషన్ / కెమికల్) :
అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి సంబంధిత విభాగంలో (మెకానికల్/ ఎలక్ట్రికల్/ఇన్స్ట్రుమెంటేషన్/కెమికల్) 3 సంవత్సరాల రెగ్యులర్ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి వుండాలి.
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఫైర్ & సేఫ్టీ) :
సైన్స్ విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించి, ఫైర్& సేఫ్టీ డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యార్హత లో జనరల్, ఓబీసీ, EWS అభ్యర్థులు 60 శాతం మార్కులు కలిగి వుండాలి & ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 50 శాతం మార్కులు కలిగి వుండాలి.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు ఎటువంటి పని అనుభవం అవసరం లేదు.అయితే వర్క్ ఎక్స్పీరియన్స్ వున్న వారు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 గరిష్ఠ వయస్సు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల 25 సంవత్సరాల లోపు గల వారై వుండాలి.
ఓబీసీ (NCL) వారికి 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులు కి 10 సంవత్సరాలు వయోసదలింపు కలదు.
🔥దరఖాస్తు విధానం :
అభ్యర్థులు ఆన్లైన్ విధానం లో అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
🔥 దరఖాస్తు ఫీజు :
జనరల్ / ఓబీసీ / EWS అభ్యర్థులు 1180/- రూపాయలు (GST తో కలిపి) ను దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి.
ఎస్సీ, ఎస్టీ, ఏక్స్ సర్వీస్ మాన్, దివ్యాంగులు కి ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
🏹 ప్రతీ రైతుకు 20,000/- వచ్చే పథకం ప్రారంభం – Click here
🔥 ఎంపిక విధానం :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ను కంప్యూటర్ ఆధారిత వ్రాత పరీక్ష,గ్రూప్ డిస్కషన్, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, ప్రీ ఎంప్లాయిమెంట్ మెడికల్ ఎగ్జామినేషన్, ఫిజికల్ ఫిట్నెస్ ఎఫిసీయన్సీ టెస్ట్ వంటివి నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఫిజికల్ ఫిట్నెస్ పరీక్ష కేవలం క్వాలిఫైయింగ్ గా ఉంటుంది.
🔥 కంప్యూటర్ ఆధారిత వ్రాత పరీక్ష :
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో అర్హత ప్రమాణాలు కలిగి వున్న వారికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో జనరల్ ఆప్టిట్యూడ్ మరియు టెక్నికల్ అంశాల పై ప్రశ్నలు వుంటాయి.
జనరల్ ఆప్టిట్యూడ్ : ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటెటివ్ ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్ వంటి అంశాలపై ప్రశ్నలు వుంటాయి.
టెక్నికల్ / ప్రొఫెషనల్ నాలెడ్జ్: అభ్యర్థుల యొక్క విద్యార్హత సబ్జెక్టు పై ప్రశ్నలు వుంటాయి.
🔥 జీతం:
ఎంపిక అయిన అభ్యర్థులకు 30,000/- రూపాయల నుండి 1,20,000/- రూపాయల గల పే స్కేల్ వర్తిస్తుంది.
వీరికి ప్రారంభంలోనే 80 వేలకి పైగా జీతం లభిస్తుంది.
🔥 ప్రొబేషన్:
ఎంపిక కాబడిన అభ్యర్థులు ఉద్యోగంలో జాయిన్ అయిన తేది నుండి ఒక సంవత్సర కాలం పాటు ప్రొబెషన్ లో వుంచబడతారు.
🔥 ముఖ్యమైన తేదిలు:
ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది : 26/03/2025. (ఉదయం 09:00 గంటల నుండి)
ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది : 21/05/2025.