హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ నుండి 320 పోస్టులకు దరఖాస్తులు దరఖాస్తులు కోరుతూ అధికారికంగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్. ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హత ఉన్న ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు ఆన్లైన్ విధానంలో ఫిబ్రవరి 17వ తేది నుండి మార్చి 17వ తేదీలోపు ఆన్లైన్ విధానంలో అప్లై చేయవచ్చు.
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వివరాలు అన్ని పూర్తిగా తెలుసుకొని అర్హత ఉన్న వారు అప్లై చేయండి.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ, అవది , చెన్నై నుండి ఈ నోటిఫికేషన్ విడుదలైంది.
🔥 భర్తీ చేస్తున్న పోస్టుల సంఖ్య :
మొత్తం 320 అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
భర్తీ చేస్తున్న పోస్టుల్లో గ్రాడ్యుయేట్ (ఇంజనీరింగ్) అప్రెంటిస్ పోస్టులు 110, డిప్లొమా (టెక్నీషియన్) అప్రెంటిస్ పోస్టులు 110, నాన్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు 100 భర్తీ చేస్తున్నారు.
🔥 విద్యార్హతలు :
సంబంధిత విభాగాల్లో డిగ్రీ, డిప్లొమా, బీటెక్ వంటి విద్యార్హతలు 2021, 2022, 2023, 2024 లో పూర్తి చేసిన వారు అర్హులు.
🔥 అప్రెంటిస్ శిక్షణ కాలం :
ఎంపికైన వారికి ఒక సంవత్సరం పాటు అప్రెంటిస్ శిక్షణ ఇస్తారు.
🏹 రైల్వే సంస్థలో 1003 ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం
🔥 అప్లికేషన్ ఫీజు :
ఎస్సీ, ఎస్టీ, PwBD మరియు మహిళలకు ఫీజు లేదు.
మిగతా వారికి అప్లికేషన్ ఫీజు 100/-
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ :
ఈ అప్రెంటిస్ పోస్టులకు 17-02-2025 తేది నుండి అప్లై చేసుకోవచ్చు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
17-03-2025 తేది లోపు అప్లై చేయవచ్చు.
🔥 ఎంపికైన అభ్యర్థులు జాబితా విడుదల తేదీ :
25-03-2025 తేదిన ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల చేస్తారు.
🔥 సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ తేదీ :
ఎంపికైన అభ్యర్థులకు ఏప్రిల్ 14వ తేదీ నుండి ఏప్రిల్ 17వ తేదీ వరకు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేస్తారు.
🔥 అప్లికేషన్ విధానం :
అర్హత ఉన్న అభ్యర్థులు Online లో అప్లై చేయాలి.
🔥 వయస్సు :
అప్రెంటిస్ నిబంధనల ప్రకారం వయస్సు ఉండాలి.
🔥 స్టైఫండ్ :
ఎంపికైన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్టైఫండ్ ఇస్తారు.
గ్రాడ్యుయేట్ (ఇంజనీరింగ్) అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు 9,000/- స్టైఫండ్ ఇస్తారు.
నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు 9,000/- స్టైఫండ్ ఇస్తారు.
డిప్లమో అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైన వారికి ఈ నెలకు 8,000/- స్టైఫండ్ ఇస్తారు.
🔥 ఎంపిక విధానం :
అర్హత ఉన్న వారిని షార్ట్ లిస్ట్ చేసి , డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🏹 Note : ఈ పోస్టులకు అప్లై చేయాలీ అనుకునే వారు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని అప్లై చేయండి.
🏹 Download Full Notification – Click here