నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ (NSIC) నుండి అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు దరఖాస్తుల కోరుతూ అధికారికంగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది..
ఈ ఉద్యోగాలకు అర్హత గల భారతీయ పౌరులు అందరి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు ముందుగా ఆన్లైన్ లో డిసెంబర్ 27వ తేదీలోపు దరఖాస్తు చేసుకొని , అప్లికేషన్ ప్రింట్ ను పోస్ట్ ద్వారా జనవరి 3వ తేదీలోపు చేరే విధంగా పంపించాలి.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొంత సమాచారం మీరు తెలుసుకొని అర్హత ఉంటే తొందరగా అప్లికేషన్ పెట్టుకోండి.
▶️ మరి కొన్ని రకాల ఉద్యోగాల సమాచారం 👇 👇 👇
🏹 10,956 గ్రామ రెవెన్యూ అధికారుల పోస్టులు భర్తీ – Click here
🏹 నవోదయ & కేంద్రీయ విద్యాలయాల్లో 6,700 ఉద్యోగాలు భర్తీ – Click here
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నుండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
- NSIC నుండి విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ మేనేజర్ అనే పోస్టుల కోసం అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య :
- మొత్తం ఖాళీల సంఖ్య – 25
🔥 విద్యార్హతలు :
- కనీసం 60 శాతం మార్కులతో నాలుగు సంవత్సరాల బిఈ లేదా బీటెక్ సివిల్, మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ , ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ , కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పూర్తి చేసి ఉండాలి.
- SC, ST, PwBD అభ్యర్థులు అయితే 55% మార్కులతో పూర్తిచేసిన అప్లై చేసుకోవచ్చు.
- అభ్యర్థులు GATE పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
🔥 అప్లికేషన్ విధానం :
- ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు తమ దరఖాస్తులను ఆన్లైన్ లో సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ప్రింట్ ను పోస్టు ద్వారా పంపించాలి.
🔥 ఎంపిక విధానం :
- అభ్యర్థులను గేట్ స్కోర్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. (గేట్ స్కోర్ కు 70% ఇంటర్వ్యూకు 30% మార్కుల కేటాయింపు జరుగుతుంది)
🔥 అప్లికేషన్ ఫీజు :
- SC / ST / PwBD మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
- మిగతా వారికి ఫీజు – 1500/-
🔥 జీతము :
- NSIC లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు 30,000/- నుండి 1,20,000/- వరకు పే స్కేల్ ఉంటుంది.
🔥 పోస్టింగ్ ప్రదేశం :
- ఎంపికైన అభ్యర్థులను దేశవ్యాప్తంగా ఉన్న NSIC ఆఫీసులు లేదా టెక్నికల్ సెంటర్స్ లో పోస్టింగ్ ఇస్తారు.
🔥 వయస్సు :
- 18 నుండి 28 సంవత్సరాలు మధ్య వయస్సు ఉండాలి.
🔥 వయసులో సడలింపు :
- అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు వర్తిస్తుంది. అనగా
- SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసులో సడలింపు వర్తిస్తుంది.
- OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయసులో సడలింపు వర్తిస్తుంది.
- PwBD అభ్యర్థులకు వయస్సులో 10 సంవత్సరాలు సడలింపు వర్తిస్తుంది.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేది :
- 07-12-2024 తేది నుండి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
- 27-12-2024 తేదీలోపు అభ్యర్థులు తమ ఆన్లైన్ లో అప్లై చేయాలి.
🔥 పోస్ట్ ద్వారా అప్లికేషన్ పంపించడానికి చివరి తేదీ :
- 03-01-2025 వ తేదీలోపు అభ్యర్థులు తమ అప్లికేషన్ కు అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ జతపరిచి పోస్ట్ ద్వారా పంపించాలి.
🔥 అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా :
- Senior General Manager – Human Resources , The National Small Industries Corporation Limited , “NSIC Bhawan”, Okhla Industrial Estate , New Delhi-110020 , Tel: 011-26926275
Note: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివిన తర్వాత అప్లికేషన్ పెట్టుకోండి.
👉 Full Notification – Click here