CBSE Single Girl Child Scholarship Apply Online | CBSE సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్ షిప్

CBSE Single Girl Child Scholarship 2025
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

CBSE Single Girl Child Scholarship : సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE ) సంస్థ నుండి ప్రతీ సంవత్సరం అందించే సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ కొరకు 2025 విద్యా సంవత్సరానికి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఈ స్కాలర్షిప్ ప్రతిభ కలిగిన విద్యార్ధినుల కొరకు ప్రవేశ పెట్టబడింది. తల్లి తండ్రులకు ఏకైక సంతానంగా ఉన్న వారు ఈ స్కాలర్ షిప్ పొందేందుకు అవకాశం ఉంటుంది.

ఈ స్కాలర్షిప్ ఏ విద్యార్హత కలిగిన వారికి లభిస్తుంది ? ఈవిధంగా దరఖాస్తు చేసుకోవాలి ? స్కాలర్షిప్ లభించే మొత్తం ఎంత ? ఏ తేదీ లోగా ఈ స్కాలర్షిప్ కి దరఖాస్తు చేసుకోవాలి ? వంటి వివిధ అన్ని అంశాల సమగ్ర సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు…

🔥స్కాలర్షిప్ కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్న సంస్థ :

  • సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE ) కొత్తగా దరఖాస్తు చేసుకొనేందుకు గాను మరియు రెన్యువల్ చేసుకొనేందుకు గాను దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.

🔥 అందించే స్కాలర్షిప్ :

  • అర్హత కలిగిన విద్యార్థిని లకు సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్ షిప్ అందిస్తారు.

🔥 అర్హతలు :

  • విద్యార్థినిలు CBSE నిర్వహించిన 10 వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇందులో కనీసం 70 శాతం మార్కులు సాధించి ఉండాలి.
  • ప్రస్తుతం CBSE అనుబంధ పాఠశాలలో 11 వ తరగతి అభ్యసిస్తూ వుండాలి.
  • తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 8 లక్షల లోపు ఉండాలి.
  • 11 వ తరగతి మరియు 12 వ తరగతి చదువుతున్న విద్యార్థుల ట్యూషన్ ఫీజు నెలకు 2,500 రూపాయల నుండి 3,000 రూపాయల లోపు ఉండాలి.
  • NRI విద్యార్థినిలు కూడా ఈ పథకానికి అర్హత కలిగి ఉంటారు.వీరి యొక్క ట్యూషన్ ఫీజు నెలకు 6,000 రూపాయలు మించి ఉండరాదు.

🔥లభించే స్కాలర్షిప్ వివరాలు :

  • ఈ స్కాలర్షిప్ కి ఎంపిక అయిన వారికి నెలకు 1000 /- రూపాయలు చొప్పున 2 సంవత్సరాలు పాటు స్కాలర్ షిప్ లభిస్తుంది.

🔥 దరఖాస్తు చేయు విధానం :

  • ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్లైన్ చేసేందుకు గాను విద్యార్థి యొక్క ప్రాధమిక వివరాలు అవసరం అవుతాయి.
  • ఆన్లైన్ లో విద్యార్థి చదువుతున్న పాఠశాల ప్రిన్సిపల్ వారి నుండి ధృవీకరించబడిన మొదటి క్వార్టర్ ఫీజు రిసెప్ట్ లను అప్లోడ్ చేయవలసి వుంటుంది.

🔥 వెరిఫికేషన్ మరియు ఎంపిక ప్రక్రియ :

  • దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను సంబంధిత పాఠశాల లు అక్టోబర్ 30 నాటికి వెరిఫై చేయాల్సి వుంటుంది.
  • అర్హత కలిగిన వారు అందరికీ ఈ పథకం లభిస్తుంది. ఎటువంటి పరిమితులు లేవు.
  • ఈ స్కాలర్షిప్ కి అర్హత సాధించిన వారు ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాలి.

🔥 ముఖ్యమైన తేదీలు :

  • ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 23/102/25
  • పాఠశాలల వారు వెరిఫికేషన్ చేయుటకు తేదీ : 25/10/2025 నుండి 30/10/2025

👉 Click here for official public Notice

👉 Click here to Apply

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *