Canara Bank Graduate Apprentice Notification 2025 : ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన కెనరా బ్యాంక్ నుండి 3500 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు అర్హత ఉన్న భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు అప్లై చేసే రాష్ట్రానికి సంబంధించిన స్థానిక భాష తప్పనిసరిగా వచ్చి ఉండాలి.
ఈ అప్రెంటిస్ పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని అర్హత ఉన్నవారు త్వరగా ఈ పోస్టులకు అప్లై చేయండి. అప్లై చేయడానికి చివరి తేదీ అక్టోబర్ 12వ తేదీ వరకు ఇచ్చారు.
✅ AIIMS మంగళగిరి లో ఉద్యోగాలు – Click here
Table of Contents :
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
ఈ నోటిఫికేషన్ కెనరా బ్యాంక్ నుండి విడుదల కావడం జరిగింది.
భర్తీ చేస్తున్న పోస్టులు :
క గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేసేందుకు కెనరా బ్యాంకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీల సంఖ్య :
దేశవ్యాప్తంగా 3500 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేసేందుకు కెనరా బ్యాంక్ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది..
ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 242 పోస్టులు, తెలంగాణ రాష్ట్రంలో 132 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అర్హతలు :
సెప్టెంబర్ ఒకటి 2025వ తేదీ నాటికి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
వయస్సు 20 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
వయస్సులో సడలింపు వివరాలు :
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు, విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు వయస్సులో పది సంవత్సరాలు సడలింపు ఇస్తారు.
అప్లికేషన్ తేదీలు :
అర్హత ఉండే అభ్యర్థులు ఈ అప్రెంటిస్ పోస్టులకు ఆన్లైన్ విధానంలో సెప్టెంబర్ 23వ తేదీ నుండి అక్టోబర్ 12వ తేదీ లోపు కెనరా బ్యాంక్ అధికారిక వెబ్సైట్లో అప్లై చేయాలి.
ఎంపిక ప్రక్రియ :
అభ్యర్థులను 12వ తరగతిలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఈ అప్రెంటిస్ పోస్టుల భర్తీలో ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు.
స్టైఫండ్ వివరాలు :
అప్రెంటిస్ పోస్టులకి ఎంపికైన వారికి నెలకు 15000 రూపాయలు స్టైఫండ్ ఇస్తారు. ఇందులో 10,500 బ్యాంకు వారు చెల్లిస్తారు. 4,500 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుంది.
✅ Download Notification – Click here
✅ Official Website – Click here
