భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో గల భారత్ డైనమిక్ లిమిటెడ్ , భానూర్ యూనిట్ నుండి ట్రేడ్ అప్రెంటిస్షిప్ కొరకు అప్రెంటిస్ ట్రైనింగ్ ప్రోగ్రాం కొరకు అధికారిక నోటిఫికేషన్ విడుదల అయింది . భారత్ డైనమిక్ లిమిటెడ్ సంస్థ భారత ప్రభుత్వం డిఫెన్స్ మినిస్ట్రీ పరిధిలోగల మినీ రత్న క్యాటగిరి 1 పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 110 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ అప్రెంటిస్ ఉద్యోగాలు పొందేదుకు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ? ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది ? అవసరమగు విద్యార్హతలు ఏమిటి ? వయో పరిమితి ఎంత ఉండాలి ? వంటి వివిధ అంశాల సమగ్ర సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

  • సంగారెడ్డి జిల్లా నందుగల భారత డైనమిక్ లిమిటెడ్ సంస్థ నుండి ఈ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయింది.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :

  • ఈ నోటిఫికేషన్ ద్వారా ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలను వివిధ విభాగాలలో భర్తీ చేస్తున్నారు.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాల సంఖ్య :

మొత్తం 110 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

  1. ఫిట్టర్ – 33
  2. ఎలక్ట్రానిక్స్ మెకానిక్ – 22
  3. మెషినిస్ట్( C ) – 08
  4. మెషినిస్ట్ ( G ) – 04
  5. వెల్డర్ – 06
  6. మెకానిక్ డీజిల్ – 02
  7. ఎలక్ట్రీషియన్ – 06
  8. టర్నర్ – 08
  9. COPA – 16
  10. ప్లంబర్ – 01
  11. కార్పెంటర్ – 01
  12. R & AC – 02
  13. LACP – 01

🔥 వయోపరిమితి :

  • 14 సంవత్సరాలు నిండి ఉండి 30 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • వయస్సు నిర్ధారణ కొరకు 31/09/2025 ను కటాఫ్ తేదీ గా నిర్ణయించారు.
  • ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు , దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయో సడలింపు లభిస్తుంది.

🔥 అవసరమగు విద్యార్హతలు :

  • 10వ తరగతి అర్హత సాధించి సంబంధిత విభాగంలో ఐటిఐ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.

🔥 దరఖాస్తు చేయు విధానము :

  • అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అప్రెంటిస్షిప్ ఇండియా అధికారిక వెబ్సైట్ నుండి దరఖాస్తు చేసుకోవాలి.

🔥 ఎంపిక విధానము :

  • సంబంధిత విద్యార్హతలు వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

🔥 స్టైఫండ్ :

  • ఎంపిక అయిన వారికి ప్రభుత్వ నియమ నిబంధనలు మేరకు ప్రతి నెల స్టైఫండ్ లభిస్తుంది.

🔥 ముఖ్యమైన తేదీలు :

  • నోటిఫికేషన్ విడుదల అయిన తేదీ : 16/10/2025
  • దరఖాస్తు సమర్పణ కొరకు చివరి తేదీ : 30/10/2025

👉 Click here for notification

👉 Click here to apply

👉 Click here for official website

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *