కేంద్ర ప్రభుత్వ సంస్థలో Contract Basis Jobs Recruitment 2025 | AVNL Recruitment 2025 | Latest Government Job

భారత ప్రభుత్వం, రక్షణ శాఖ పరిధిలోని ఆర్మ్డ్ వెహికల్స్ నిగం లిమిటెడ్ (AVNL) సంస్థ పరిధిలోని ఇంజన్ ఫ్యాక్టరీ అవడి నందు జూనియర్ మేనేజర్ & జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేసేందుకు గాను ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం అన్ని విభాగాలలో కలిపి 80 ఉద్యోగాల నియామకం జరగనుంది. 

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి, దరఖాస్తు విధానం, విద్యార్హతలు, జీతం, ఎంపిక విధానం వంటి అన్ని పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel 

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :

  • ఆర్మ్డ్ వెహికల్స్ నిగం లిమిటెడ్ (AVNL) సంస్థ పరిధిలోని ఇంజన్ ఫ్యాక్టరీ అవడి సంస్థ ఈ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 

  • మొత్తం 80 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:

  • జూనియర్ మేనేజర్(ప్రొడక్షన్ ) – 02
  • జూనియర్ మేనేజర్(క్వాలిటీ ) – 03
  • జూనియర్ మేనేజర్(డిజైన్) – 01
  • జూనియర్ మేనేజర్ (హ్యూమన్ రిసోర్సెస్) – 01
  • జూనియర్ మేనేజర్ (సేఫ్టీ) – 01
  • జూనియర్ మేనేజర్ (ఫైనాన్స్ & అకౌంట్స్) – 01
  • జూనియర్ మేనేజర్ (మార్కెటింగ్ & ఎక్సపోర్ట్స్) – 1
  • జూనియర్ టెక్నీషియన్ (ఫిట్టర్ జనరల్)  – 58
  • జూనియర్ టెక్నీషియన్ (మేకానిస్ట్) – 11
  • జూనియర్ టెక్నీషియన్ (వెల్దర్) – 1 

🔥 విద్యార్హత :

  • జూనియర్ మేనేజర్ ఉద్యోగాలకు సంబంధిత విభాగంలో ఫస్ట్ క్లాస్ డిగ్రీ / MBA / పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత తో పాటు 2 సంవత్సరాల పని అనుభవం అవసరం.
  • జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధిత విభాగంలో నేషనల్ అప్రెంటిస్ షిప్ సర్టిఫికెట్  / నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి వుండాలి మరియు సంబంధిత విభాగంలో ఒక సంవత్సరం పని అనుభవం కలిగి వుండాలి.

🔥 గరిష్ఠ వయస్సు :

  • 18 సంవత్సరాల వయస్సు నుండి వుండి,28 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు ,& ఓబీసీ (NCL) వారికి 3 సంవత్సరాలు & దివ్యాంగులుకి 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.

🔥దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు ఆఫ్లైన్ విధానం లో దరఖాస్తు చేసుకోవాలి.
  • నోటిఫికేషన్ లో ఇచ్చిన అప్లికేషన్ ఫారం ని డౌన్లోడ్ చేసుకొని , ఫిల్ చేసి అప్లికేషన్ ఫారం ను క్రింద పేర్కొన్న చిరునామాకు నోటిఫికేషన్ లో ప్రస్తావించిన చివరి తేది లోగా దరఖాస్తు చేసుకోవాలి.

🔥 దరఖాస్తు పంపవలసిన చిరునామా :

  • The Chief General Manager, Engine Factory, Avadi, Chennai – 600054 

🔥 అప్లికేషన్ ఫీజు

  • అభ్యర్థులు 300 /- రూపాయలు దరఖాస్తు ఫీజును చెల్లించాలి.
  • ఎస్సీ, ఎస్టీ , దివ్యాంగులు, ఎక్స సర్వీస్మెన్ వారి ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

🔥 జీతం

  • అభ్యర్థులు ఎంపిక కాబడిన పోస్టుల ఆధారంగా  జీతం లభించింది.
  • జూనియర్ మేనేజర్ వారికి  – 30,000 /- రూపాయలు జీతం తో పాటు వివిధ రకాల అల్లోవెన్స్ లు లభిస్తాయి.
  • జూనియర్ టెక్నీషియన్ వారికి 21,000/- రూపాయలు జీతం తో పాటు వివిధ రకాల అల్లోవెన్స్ లు లభిస్తాయి.

🔥 ఎంపిక విధానం :

  • జూనియర్ మేనేజర్ :  అభ్యర్థులు యొక్క అకడమిక్ క్వాలిఫికేషన్ లో వచ్చిన మార్కులకు 85 శాతం వెయిట్ అజ్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ కి 15 శాతం వెయిట్ ఏజ్ కేటాయించారు.
  • జూనియర్ టెక్నీషియన్ : అభ్యర్థులకు సంబంధిత విద్యార్హత లో వచ్చిన మార్కులకు 100 శాతం వెయిటేజ్ లభిస్తుంది.అయితే వీరు ట్రేడ్ టెస్ట్ ఉత్తీర్ణత సాధించవలసి వుంటుంది.

🔥 ముఖ్యమైన తేదిలు: 

  • నోటిఫికేషన్ విడుదల తేది : 18/03/2025.
  • దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది: 05/04/2025.

👉  Click here for notification

👉 Click here for official website 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!