APSRTC Apprentice Notification 2025 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుండి 291 ఖాళీలతో అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన వివరాలన్నీ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని అర్హత ఉన్నవారు త్వరగా అప్లికేషన్ సబ్మిట్ చేయండి.
ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ద్వారా డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, పెయింటర్, మెషినిస్ట్, ఫిట్టర్, డ్రాఫ్ట్ మెన్ (సివిల్) ట్రేడ్లలో అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేసేందుకు ఎన్టీఆర్, కృష్ణ, పశ్చిమగోదావరి, ఏలూరు, గుంటూరు, బాపట్ల మరియు పల్నాడు జిల్లాల నందు ఐటిఐ కాలేజీల నుండి ఉత్తీర్ణులైన వారు నుండి దరఖాస్తుల కోరుతున్నారు.
Table of Contents
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ, విజయవాడ జోనల్ శిక్షణ కళాశాల నుండి విడుదలైంది.
భర్తీ చేస్తున్న పోస్టులు :
ఈ నోటిఫికేషన్ ద్వారా డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, పెయింటర్, మెషినిస్ట్, ఫిట్టర్, డ్రాఫ్ట్ మెన్ (సివిల్) ట్రేడ్లలో అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేస్తున్నారు..
మొత్తం ఖాళీలు సంఖ్య :
నోటిఫికేషన్ ద్వారా వివిధ ట్రేడ్లలో మొత్తం 291 అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
అర్హతలు :
డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, పెయింటర్, మెషినిస్ట్, ఫిట్టర్, డ్రాఫ్ట్ మెన్ (సివిల్) ట్రేడ్లలో ఐటిఐ పూర్తి చేసిన వారు అర్హులు.
అప్లికేషన్ తేదీలు :
ఈ అప్రెంటిస్ పోస్టులకు అర్హులేని వారు తమ దరఖాస్తులను ఆన్లైన్లో నవంబర్ 15వ తేదీ నుండి నవంబర్ 30వ తేదీ లోపు సబ్మిట్ చేయాలి. నవంబర్ 30వ తేదీ తరువాత చేసిన దరఖాస్తులను పరిగణలోకి తీసుకోరు.
అప్లికేషన్ ఫీజు వివరాలు :
వెరిఫికేషన్ కు హాజరయ్యే అభ్యర్థులు జీఎస్టీతో కలిపి 118/- రూపాయలు ఫీజు చెల్లించాలి.
✅ Registration Link – Click here
✅ Download Notification – Click here
