APEPDCL Centre Head Recruitment 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్ (CoEET), ఆంధ్రప్రదేశ్ నుండి నోటిఫికేషన్ విడుదలైంది.
రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ముఖ్యమైన వివరాలు క్రింది విధంగా ఉన్నాయి..
Table of Contents :
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్ (CoEET), ఆంధ్రప్రదేశ్ నుండి నోటిఫికేషన్ విడుదలైంది.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
సెంటర్ హెడ్–CoEET అనే ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు.
మొత్తం ఖాళీల సంఖ్య :
నోటిఫికేషన్ ద్వారా 01 పోస్టు భర్తీ చేస్తున్నారు.
విద్యార్హత వివరాలు :
తప్పనిసరిగా ఉండాల్సిన విద్యార్హత : కనీసం 60% మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉండాలి.
Desirable Qualification : ప్రఖ్యాత జాతీయ / అంతర్జాతీయ సంస్థ నుండి ఏదైనా స్ట్రీమ్‌లో MBA/PGDM.
కనీసం 10 సంవత్సరాల పోస్ట్-క్వాలిఫికేషన్ అనుభవం ఉండాలి దీనిలో కనీసం 5 సంవత్సరాలు ఇంధన రంగంలో ఉండాలి స్టార్టప్ ఎకోసిస్టమ్, ఇంక్యుబేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సపోర్ట్ మరియు ఇన్నోవేషన్‌లో అనుభవం ఉండాలి
జీతము వివరాలు :
నెలకు 1,50,000/- నుండి 2,00,000/- వరకు జీతము ఇస్తారు.
అప్లికేషన్ విధానం వివరాలు :
అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు https://www.apeasternpower.com వెబ్సైట్ లో ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
అప్లికేషన్ తేదీలు :
అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 09-01-2026 తేదీ నుండి 07-02-2026 తేదీలోపు అప్లై చేయాలి.
ఎంపిక విధానం వివరాలు :
అర్హత గల అభ్యర్థులను రాత/ కంప్యూటర్ ఆధారిత పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
పోస్టింగ్ ప్రదేశం :
సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్ (CoEET), APEPDCL, శిక్షణా కేంద్రం, సాగర్ నగర్, విశాఖపట్నం.
✅ అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక :
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్స్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి అప్లై చేయవచ్చు.
▶️ Download Notification – Click here
