Super six schemes Launching dates – AP New Schemes :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు మంచి శుభవార్త తెలియజేసింది. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన విధంగా సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా అన్నదాత సుఖీభవ మరియు తల్లికి వందనం పథకాలను జూన్ 12వ తారీఖున విడుదల చేయనున్నట్లు ఈరోజు ప్రకటించడం జరిగింది.
అలానే ప్రజలు ఎప్పటినుండో వేచి చూస్తున్నా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని కూడా రెండు నెలల లోపుగా ప్రారంభిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు గారు అధికారికంగా తెలియజేశారు.
దీనితో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం ఒక లక్షకు పైగా పెన్షన్లను అలానే దీపం పథకం గురించి కూడా అప్డేట్లు ఇవ్వడం జరిగింది.
రాష్ట్రలో కూటమి ప్రభుత్వం ఏర్పడి జూన్ 12వ తేదీ నాటికి ఒక సంవత్సరం పూర్తి కావస్తున్నందున వివిధ పథకాలు కి సంబంధించి వివిధ అంశాలను ఈరోజు తెలియజేశారు.
పూర్తి సమాచారం కొరకు ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
🏹 ఏపీలో కొత్త రేషన్ కార్డులుకు whatsapp లో దరఖాస్తులు ఆహ్వానం – Click here
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 జూన్ 12 వ తేదీన తల్లికి వందనం మరియు అన్నదాత సుఖీభవ పథకాలు :
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల్లో ప్రాధాన్యత పథకాలు అయినటువంటి అన్నదాత సుఖీభవ మరియు తల్లికి వందనం పథకాలను జూన్ 12వ తారీఖున అమలు చేయనున్నట్లు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో నిర్ణయించడం జరిగింది.
🔥 అన్నదాత సుఖీభవ :
- అన్నదాత సుఖీభవ పథకం ద్వారా పియం కిషన్ పథకంతో పాటుగా భూమి కలిగి అర్హత ఉన్న ప్రతి రైతుకు 3 విడతల్లో 20వేల రూపాయలను పెట్టుబడి సాయంగా అందించనున్నారు.
- ఇందుకుగాను ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.
- భూమి కలిగి ఉన్న రైతులతో పాటుగా కవులు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా లబ్ధి చేకూర్చునున్నట్లు ప్రభుత్వం ఎప్పటికే ప్రకటన చేసిన విషయం తెలిసిందే.
🏹 ఇలాంటి పథకాల సమాచారం మీ మొబైల్ కు రావాలి అంటే మా what’s app ఛానల్ లో జాయిన్ అవ్వండి – Click here
🔥 తల్లికి వందనం పథకం :
- ఒకటవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు 75% హాజరు కలిగి ఉన్న వారందరికీ కూడా ప్రతి విద్యార్థికి కూడా సంవత్సరానికి 15000 రూపాయలు చొప్పున చెల్లించే పథకమే ఈ తల్లికి వందనం పథకం.
- రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఈ పథకాన్ని ప్రభుత్వం ఏర్పాటు అయి ఒక సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా జూన్ 12వ తేదీన అకౌంట్లో జమ చేసేందుకు నిర్ణయించింది.
- స్కూల్ ఓపెన్ అయ్యే కంటే ముందే తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు జమ చేయనున్నారు.
🔥 లక్ష మంది వితంతువులు మరియు ఒంటరి మహిళలకు పెన్షన్లు :
- రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ పెన్షన్లు పెంపు కార్యక్రమం ద్వారా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని నిర్విఘ్నంగా అమలు చేస్తుంది.
- ఈ పథకంలో భాగంగా కొత్తగా పెన్షన్ దరఖాస్తు చేసుకునేందుకు వితంతువులకు మరియు ఒంటరి మహిళలకు అవకాశం కల్పించనుంది.
- అర్హత కలిగి ఉన్న వితంతువులకు మరియు ఒంటరి మహిళలకు జూన్ 12వ తేదీ నాడే పెన్షన్ మంజూరు చేయనుంది.
- ఇప్పటికే పెన్షన్ స్పౌజ్ పెన్షన్ క్యాటగిరి ద్వారా వితంతువులకు పెన్షన్ దరఖాస్తులకు అవకాశం కల్పించగా, ఇప్పుడు వీడియో క్యాటగిరి ద్వారా మరికొంతమందికి పెన్షన్ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు.
- వీటితో పాటుగా 50 సంవత్సరాలు దాటి ఉండి ఒంటరి మహిళలకు పెన్షన్ దరఖాస్తు చేసుకునేందుకు కూడా అవకాశం కల్పించనున్నారు.
🔥 ఉచిత బస్సు ప్రయాణం పథకం – మరికొద్ది రోజులలో :
- రాష్ట్ర ప్రజలు వేచి చూస్తున్న పథకాలలో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం కోసం కూడా ప్రభుత్వం మంచి శుభవార్త తెలియజేసింది.
- రాబోయే రెండు నెలలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకమును అమలు చేయనున్నట్లు మంత్రి అచ్చెంనాయుడు గారు తెలియజేశారు.
🔥 దీపం పథకం పై గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం :
- రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దీపం పథకం ను గత దీపావళి నుంచి అమలు చేస్తూ ఉండగా, ఈ పథకానికి సంబంధించి మరొక శుభవార్తను ప్రజలకు తెలియజేసింది.
- దీపం పథకం ద్వారా నాలుగు నెలలకు ఒకసారి ఒక గ్యాస్ సిలిండర్ చొప్పున సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లను అందించేందుకు గాను అవకాశం కల్పిస్తుంది.
- అయితే ప్రస్తుతం ఈ పథకంలో భాగంగా సిలిండర్లు తీసుకోకపోయినా మూడు సిలిండర్ల యొక్క నగదును ఒకేసారి చెల్లించేందుకుగాను నిర్ణయం తీసుకున్నామని మంత్రి అచ్చెంనాయుడు గారు ఒక ప్రకటనలో తెలియజేశారు.
🔥 నోట్ : రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అమలు చేయబోతున్న అన్ని పథకాలకు సంబంధించి అర్హతలు దరఖాస్తు చేయు విధానం మరియు గవర్నమెంట్ ఆర్డర్స్ విషయాలను మరో ఆర్టికల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది.
సంబంధిత సమాచారాన్ని మీకు తెలిసిన వారికి మన ఆర్టికల్ ద్వారా షేర్ చేసి, ఉపయోగపడే విధంగా చేస్తారని ఆశిస్తున్నాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుతం పథకాలు & సర్వీసులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు వంటి వివరాలు కొరకు మన పేజీ ను ఫాలో అవ్వగలరు.