AP Staff Nurse Selection Lists : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025 జనవరి నెలలో విడుదల చేసిన స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులకు ముఖ్యమైన సమాచారం వచ్చింది.. జోన్ -1 మరియు జోన్ -2 లో ఎంపికైన అభ్యర్థులకు సంబంధించిన సెలెక్షన్ లిస్టులో విడుదల చేశారు.
జోన్-1 లో 34 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసి సెప్టెంబర్ 10వ తేదీన విశాఖపట్నంలో ఉన్న రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ వారి కార్యాలయంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నారు.
జోన్ -2 లో 59 స్టాఫ్ నర్స్ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేశారు. ఈ పోస్టులకు ఎంపికైన వారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఉన్న రీజినల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ ఫర్ కార్యాలయంలో సెప్టెంబర్ 9వ తేదీన జరిగే సర్టిఫికెట్ వెరిఫికేషన్కు హాజరు కావాలి.
జోన్ -4 లో 68 మంది అభ్యర్థులను స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు ఎంపిక చేశారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి సెప్టెంబర్ 11వ తేదీన ప్రాంతీయ సంచాలకులు, వైద్య ఆరోగ్యశాఖ కడప, ఓల్డ్ రిమ్స్ కార్యాలయం నందు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు.
ఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్ లకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా ఒరిజినల్ మరియు ఒక సెట్ జిరాక్స్ కాపీలతో సర్టిఫికెట్ వెరిఫికేషన్కు హాజరు కావాలి. అభ్యర్థుల సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేసి కౌన్సిలింగ్ నిర్వహించి అదే రోజు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది.
సెలక్షన్ లిస్టులు డౌన్లోడ్ చేసుకునేందుకు క్రింది ఇచ్చిన లింకు పైన క్లిక్ చేయండి..
డ✅ Zone-1 Selection List – Click here
✅ Zone-2 Selection List – Click here
✅ Zone-4 Selection List – Click here
✅ Official Website – Click here
