AP School Education Jobs Recruitment 2026 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అనుమతి ఇచ్చే ప్రాంతాల్లో జిల్లా కెరీర్ మరియు మానసిక ఆరోగ్యం కౌన్సెలర్ లుగా పని చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా 424 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు 6-01-2026 తేదీ నుండి 18-01-2026 తేదీ లోపు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి. ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
✅ ఏపీ లో 220 పర్మినెంట్ ఉద్యోగాలు – Click here
Table of Contents
రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ:
EdCIL (India) Limited అనే సంస్థ ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
డిస్ట్రిక్ట్ కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
మొత్తం ఖాళీల సంఖ్య :
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 424 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
అర్హతల వివరాలు :
ఈ క్రింది అర్హతలలో ఏదైనా ఒక అర్హత కలిగిన అభ్యర్థులు అర్హులు:
- 1. సైకాలజీలో M.Sc. / M.A (అప్లైడ్ సైకాలజీ / కౌన్సెలింగ్ సైకాలజీ / క్లినికల్ సైకాలజీ / చైల్డ్ సైకాలజీ / అడోలసెంట్ సైకాలజీ / సైకియాట్రిక్‌లో)
- 2. సోషల్ వర్క్ లో M.Sc. / M.Phil
- 3. సైకియాట్రిక్ నర్సింగ్‌లో M.Sc.
- 4. సోషల్ వర్క్‌లో మాస్టర్ (MSW) మెడికల్ & సైకియాట్రిక్ సోషల్ వర్క్ లేదా కౌన్సెలింగ్‌లో స్పెషలైజేషన్‌తో
- 5. సైకాలజీలో B.A. / B.Sc. (ఆనర్స్)
గరిష్ట వయస్సు వివరాలు :
వయస్సు 45 సంవత్సరాలు లోపు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.
అప్లికేషన్ ఫీజు వివరాలు :
ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.
అప్లికేషన్ విధానం :
అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు తమ అప్లికేషన్ ఆన్లైన్ విధానంలో గూగుల్ ఫారం నింపి అప్లై చేయాలి.
అప్లికేషన్ తేదీలు :
ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు జనవరి 6వ తేదీ నుండి జనవరి 18వ తేదీ లోపు అప్లై చేయాలి.
ఎంపిక విధానం :
అర్హత అభ్యర్థులను అప్లై చేసినప్పుడు ఇచ్చిన వివరాలు ఆధారంగా షార్ట్ లిస్టు చేసి ఇంటర్వ్యూ కు పిలుస్తారు.
జీతము వివరాలు :
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.30,000/- ప్లస్ కన్వేయన్స్ రీయింబర్స్‌మెంట్ ఆధారంగా రూ.4000/- వరకు భత్యం కూడా ఇస్తారు.
▶️ Download Notification – Click here
