ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పురోగతి కొరకు , అన్ని కులాల వారికి 50 శాతం సబ్సిడీ తో 5 లక్షల వరకు వివిధ కార్పొరేషన్ల ద్వారా రుణాలు మంజూరు చేస్తుంది. ఈ పథకానికి ఆంధ్రప్రదేశ్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ స్కీమ్ (AP self employment scheme) అని పిలుస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవలే BC , OC కులాల వారికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పించింది.
ఇప్పుడు SC కులాల వారికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాల మంజూరు కొరకు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.
ఈ రుణాలకు ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు? ఏ విధంగా దరఖాస్తు చేసుకోవచ్చు? దరఖాస్తు చేసుకో అవసరమగు దరఖాస్తులు ఏమిటి? మొదలగు పూర్తి వివరాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
🔥 విషయం :
ఎస్సీ కులాల వారికి సబ్సిడీ విధానంలో బ్యాంకు రుణాలు
🔥 ఎవరు అర్హులు :
ఎస్సీ కులానికి చెందిన, వ్యాపారాల చేసుకునేందుకు గాను ఆసక్తి కలిగిన పురుషులు & మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు.
బి. ఫార్మసీ & డి. ఫార్మసీ ఉత్తీర్ణత సాధించిన వారు జనరిక్ మెడికల్ షాపులు స్థాపించవచ్చు.
🔥 వయస్సు :
21 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
🔥 దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల రంగాలు:
వ్యవసాయ రంగం & పరిశ్రమల రంగం & సేవా రంగాల విభాగాలలో వ్యాపారం కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
🔥 అవసరమగు అర్హతలు & ధృవపత్రాలు :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థిర నివాసం కలిగి వుండాలి.
రేషన్ కార్డు లేదా రైస్ కార్డు కలిగి వుండాలి.
ఆధార్ కార్డు కలిగి వుండాలి.
కుల ధ్రువీకరణ పత్రం & ఆదాయ ధ్రువీకరణ పత్రం కలిగి వుండాలి.
పాస్ పోర్ట్ సైజ్ ఫోటో
రవాణా వాహనాల కొరకు దరఖాస్తు చేసుకొనే వారు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి వుండాలి.
🔥 రుణాల రకాలు :
స్లాబ్ – 1 : (2 లక్షల వరకు)
75 వేల వరకు సబ్సిడీ లభిస్తుంది.
స్లాబ్ – 2 : (3 లక్షల వరకు)
లక్షా ఇరవై ఐదు వేల వరకు సబ్సిడీ లభిస్తుంది.
స్లాబ్ – 3 : (5 లక్షల వరకు)
2 లక్షల వరకు సబ్సిడీ లభిస్తుంది.
స్లాబ్ – 4 ( స్పెషల్ కేటగిరి):
జనరల్ మెడిసిన్ షాప్ & MSME లకు 50 శాతం వరకు సబ్సిడీ లభిస్తుంది.
🔥 దరఖాస్తు చేయు విధానం :
ఈ సబ్సిడీ లోన్ లకు దరఖాస్తు చేసుకొనే వారు మీసేవా కేంద్రాలు , ఇంటర్నెట్ సెంటర్లు , గ్రామ సచివాలయంలలో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ విధానంలో OBMMS పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాలి.
🔥 ముఖ్యమైన తేదీలు : ఈ రుణాలకు దరఖాస్తు చేసుకొనే వారు ఏప్రిల్ 11 వ తేదీ నుండి మే 20 వరకు ఆన్లైన్ విధానం లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.