ఆంధ్రప్రదేశ్ లో గ్రంథాలయాల్లో 976 ఉద్యోగాలు భర్తీ | AP Public Libraries Department Vacancies | Andhra Pradesh Library Jobs

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల పబ్లిక్ లైబ్రరీలలో వివిధ కారణాల చేత ఖాళీగా ఉన్న ఉద్యోగాలు లైబ్రేరియన్ గ్రేడ్ – 2,  లైబ్రేరియన్ గ్రేడ్ – 3, రికార్డ్ అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్డినేట్లు, వాచ్మెన్ ఉద్యోగాలను ఔట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు అనుమతి కోరుతూ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కు లెటర్ పంపించడం జరిగింది.

ఇందులో పేర్కొన్న పలు ముఖ్య అంశాలు కోసం ఈ ఆర్టికల్లో మీకు తెలియజేయడం జరుగుతుంది. 

అభ్యర్థులు ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి, సమాచారాన్ని తెలుసుకోగలరు. 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 ఉద్యోగాలు భర్తీ చేయు సంస్థ :

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్ ఈ ఉద్యోగాల భర్తీ చేపట్టనుంది.

🔥 భర్తీ చేయబోవు ఉద్యోగాలు :

  1. లైబ్రేరియన్ గ్రేడ్ 2 
  2. లైబ్రేరియన్ గ్రేడ్ 3
  3. రికార్డ్ అసిస్టెంట్లు 
  4. ఆఫీస్ సబార్డినేట్లు 
  5. వాచ్మెన్లు

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :

  • మొత్తం 976 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో 
  1. లైబ్రేరియన్ గ్రేడ్ 2 – 92
  2. లైబ్రేరియన్ గ్రేడ్ 3 – 224
  3. రికార్డ్ అసిస్టెంట్లు – 111
  4. ఆఫీస్ సబార్డినేట్లు – 421
  5. వాచ్మెన్లు – 128

🔥 విద్యార్హత :

  1. లైబ్రేరియన్ గ్రేడ్ 2 & లైబ్రేరియన్ గ్రేడ్ 3 :
  • లైబ్రరీ సైన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి.
  1. రికార్డ్ అసిస్టెంట్లు: ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి.
  1. ఆఫీస్ సబార్డినేట్లు & వాచ్మెన్లు :
  • 7వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారికి ఆఫీస్ సబార్డినేట్ & వాచ్ మెన్ గా అవకాశం కల్పించవచ్చు.

నోట్: విద్యార్హతలు సంబంధిత నోటిఫికేషన్ లో కచ్చితంగా ప్రస్తావిస్తారు.ప్రస్తుతం ఆర్టికల్ లో పేర్కొన్న విద్యార్హతలు కేవలం అభ్యర్థి అవగాహన మేరకు మాత్రమే తెలియపరచడం అయినది.

🔥 లైబ్రరీలలో ఇన్ని ఖాళీలు ఎలా ఉన్నాయి? :

  • పబ్లిక్ లైబ్రరీలలో ఉద్యోగాలు చేస్తున్న వారు రిటైర్ కావడం, ప్రమోషన్స్ రావడం,కొంత మంది ఉద్యోగులు రిజైన్ చేయడం తో పాటు వివిధ ఇతర కారణాల వలన చాలా కాలం పాటు ఖాళీగా ఉన్నాయి
  • అనుకోని కారణాల వలన ఈ ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయకపోవడం తో ప్రస్తుత సిబ్బంది పై అదనపు భారం పడుతుంది.
  • అందుచేత ఈ భారీ ఖాళీలను ఒకే సారి భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

🔥 ఏ విధంగా భర్తీ చేయనున్నారు? :

  • ఈ ఉద్యోగాలను రెగ్యులర్ ప్రాధిపతికన భర్తీ చేసేంతవరకు  అవుట్సోర్సింగ్ ప్రాధిపతికన భర్తీ చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!