AP Outsourcing Jobs Notification 2026 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. కేవలం పదో తరగతి అర్హతతో అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అవకాశం వచ్చింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 24 పోస్టులు భర్తీ చేస్తున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులను రూల్ ఆఫ్ రిజర్వేషన్ మరియు మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు జనవరి 22వ తేదీ నుండి 31వ తేదీలోపు అప్లై చేయండి.
✅ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి 13 జిల్లాల కోర్టుల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ – Click here
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విజయవాడలో ఉన్న గవర్నమెంట్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ నుండి విడుదలైంది.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
గవర్నమెంట్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ మరియు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో ఖాళీగా ఉన్న MNO, FNO, నర్సింగ్ ఆర్డర్లీ, జనరల్ డ్యూటీ అటెండెంట్ మరియు స్ట్రెచర్ బేరర్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.
అర్హతలు :
MNO ఉద్యోగానికి పదో తరగతి విద్యార్హతతో పాటు గుర్తింపు పొందిన సంస్థ నుండి ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ పొందిన పురుష అభ్యర్థులు అర్హులు.
FNO ఉద్యోగాలకు పదో తరగతి విద్యార్హతతో పాటు గుర్తింపు పొందిన సంస్థ నుండి ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ పొందిన మహిళా అభ్యర్థులు అర్హులు.
నర్సింగ్ ఆర్డర్లీ, స్ట్రెచర్ బేరర్ ఉద్యోగాలకు పదో తరగతి విద్యార్హతతో పాటు గుర్తింపు పొందిన సంస్థ నుండి ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ పొందిన వారు అర్హులు.
జనరల్ డ్యూటీ అటెండెంట్ ఉద్యోగాలకు పదో తరగతి పాస్ అయిన అభ్యర్థులు అర్హులు.
జీతము వివరాలు :
భర్తీ చేస్తున్న అన్ని రకాల ఉద్యోగాలకు జీతము ఒకే విధముగా ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు 15,000/- జీతము ఇస్తారు.
వయస్సు వివరాలు :
ఈ ఉద్యోగాలకు 01-01-2026 తేదీ నాటికి కనీసం 18 సంవత్సరాలు నుండి 42 సంవత్సరాలు వరకు వయస్సు ఉన్న వారు అర్హులు.
వయస్సులో సడలింపు వివరాలు :
SC, ST, BC, EWS అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది.
PWD అభ్యర్థులకు వయస్సులో పదేళ్లు సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్ ఫీజు వివరాలు :
OC, BC అభ్యర్థులు 300/- రూపాయలు, SC, ST, PWD అభ్యర్థులు 200/- రూపాయలు అప్లికేషన్ ఫీజును SMC Recruitment, Vijayawada అనే పేరు మీద చెల్లుబాటు అయ్యేవిధంగా డీడీ తీసి అప్లికేషన్ కు జతపరచాలి.
అ రిక్రూట్మెంట్ ముఖ్యమైన తేదీలు :
ప్రముఖ దినపత్రికల్లో నోటిఫికేషన్ విడుదల తేది : 22-01-2026
అప్లికేషన్ తేదీలు : 22-01-2026 నుండి 31-01-2026
అప్లికేషన్స్ పరిశీలన తేదీలు : 01-02-2026 నుండి 05-02-2026
ప్ ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ విడుదల తేదీ : 10-02-2026
ఫైనల్ మెరిట్ లిస్టు విడుదల తేదీ : 16-02-2026
ఎంపిక జాబితా విడుదల తేదీ : 18-02-2026
సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ తేదీ మరియు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే తేది : 20-2-2026
అభ్యర్థులు ఎంపిక విధానం :
అప్లై చేసుకున్న అర్హత ఉన్న అభ్యర్థులను మెరిట్ మరియు రూరల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :
O/o Principal, Government Siddhartha Medical College, Vijayawada
అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక :
ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్స్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి.
✅ Download Notification & Application – Click here
