NHM Jobs in Andhrapradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ ఆరోగ్య మిషన్ లో 11 కేటగిరీల్లో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుండి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హతలు ఉండేవారు తమ దరఖాస్తులను డిసెంబర్ 20వ తేదీ లోపు సంబంధిత కార్యాలయంలో అందజేయాలి.
రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు త్వరగా అప్లై చేసుకోండి. All the best 👍
Table of Contents :
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
నఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వైద్య ఆరోగ్యశాఖలో జాతీయ ఆరోగ్య మిషన్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ కోసం విడుదల చేయబడింది..
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, ఆడియో మెట్రిషన్, సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్, హెల్త్ విజిటర్ (TB), డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం కోఆర్డినేటర్, డిస్ట్రిక్ట్ పబ్లిక్ ప్రైవేట్ మిక్స్ కోఆర్డినేటర్, అకౌంటెంట్, డ్రగ్ రెసిస్టెన్స్ టిబి కౌన్సిలర్ మరియు LGS అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు.
అర్హతలు :

అప్లికేషన్ తేదీలు :
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండే అభ్యర్థులు డిసెంబర్ 15వ తేదీ నుండి డిసెంబర్ 20వ తేదీ లోపు అప్లై చేయాలి. ఎంపికైన అభ్యర్థుల జాబితాను 2026 జనవరి 12వ తేదీన లేదా జిల్లా ఎంపిక కమిటీ ఆమోదం తెలిపిన తర్వాత విడుదల చేస్తారు.
అప్లికేషన్ ఫీజు వివరాలు :
ఈ ఉద్యోగాలకు అప్లై చేసి ఓసి మరియు బీసీ అభ్యర్థులు 300 రూపాయలు, ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులు 200/- రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు.
District Medical and Health Officer, Kakinada అనే పేరు మీద చెల్లుబాటు అయ్యేందుకు DD తీయాలి.
వయస్సు వివరాలు :
08-12-2025 తేదీ నాటికి వయస్సు 42 సంవత్సరాలు లోపు ఉండాలి.
SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
BC, EWS అభ్యర్థులకు వయస్సులో 10 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
✅ Download Notification – Click here
