ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్ …….
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త ! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రైస్ కార్డులకు సంబంధించి వివిధ సర్వీసులు కొరకు గ్రామ వార్డు సచివాలయంల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
ఇందుకు సంబంధించి అధికారిక సమాచారం విడుదల చేయబడింది.
రైస్ కార్డు కి సంబంధించి మొత్తం 7 సర్వీసులను ప్రభుత్వం 07/05/2025 నుండి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది.
ప్రస్తుతం ఏ ఏ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. వీటికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి.అవసరమగు ధ్రువపత్రాలు ఏమిటి? వంటి అన్ని అంశాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
🔥 మే 7 వ తారీఖు నుండి రైస్ కార్డు సర్వీసులు ప్రారంభం :
- ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం , కన్స్యూమర్ అఫ్ఫైర్స్ , ఫుడ్ & సివిల్ సప్లయ్ డిపార్ట్మెంట్ వారు GSWS (గ్రామ వార్డ్ సచివాలయం) ద్వారా రైస్ కార్డు సర్వీసులను పునరుద్ధరించారు.
- ఇందులో భాగంగా ప్రజల నుండి మే 07 , 2025 నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 ఏ ఏ సర్వీసులు అందుబాటులు ఉన్నాయి ?
పౌరులకు మెరుగైన సేవలు అందించాలి అన్న లక్ష్యం తో ప్రభుత్వం 7 రకాల బియ్యం కార్డు సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. అవి:
- కొత్త రైస్ కార్డు
- రైస్ కార్డులో కుటుంబ సభ్యుల చేరిక
- రైస్ కార్డు ను విభజించుట
- రైస్ కార్డు నుండి సభ్యుల తొలగింపు
- రైస్ కార్డు ను సరెండర్ చేయుట
- రైస్ కార్డ్ లో అడ్రస్ మార్చుకొనుట
- రైస్ కార్డు లో తప్పు ఆధార్ సీడింగ్ ను సరిదిద్దుట
🔥 ఈ సర్వీస్ లను ఏవిధంగా పొందాలి ?:
- రైస్ కార్డు సర్వీసుల కొరకు దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటున్న వారు వారి గ్రామ వార్డు సచివాలయం నందు గల డిజిటల్ అసిస్టెంట్ / వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వారిని సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు.
🔥 అవసరమగు ధృవపత్రాలు :
పౌరులు వారు పొందాలి అనుకుంటున్న సర్వీస్ ఆధారంగా సంబంధిత ధృవ పత్రాలను సమర్పించాలి.
- ఆధార్ కార్డులు
- బర్త్ సర్టిఫికెట్ (కుటుంబ సభ్యుల జోడింపు కొరకు)
- మ్యారేజ్ సర్టిఫికెట్ (కుటుంబ సభ్యుల జోడింపు కొరకు)
- డెత్ సర్టిఫికెట్ (కుటుంబ సభ్యుల తొలగింపు కొరకు)
- ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ
- దరఖాస్తు దారిని ఫోటో
- ఇతర ధృవీకరణ పత్రాలు
🔥 ఏ తేది లోగా దరఖాస్తు చేసుకోవాలి ? :
- ప్రాథమిక సమాచారం ప్రకారం. రైస్ కార్డు సర్వీస్ పొందాలి అనుకొనే వారు మే 31, 2025 లోగా దరఖాస్తు చేసుకోవాలి.
- ఇప్పటికే దరఖాస్తు స్వీకరణ ప్రారంభ అయినందున వీలనంత త్వరగా దరఖాస్తు చేసుకోగలరు.
🔥 రైస్ కార్డుల కొరకు దరఖాస్తు చేసుకొనే సరిపోతుందా? :
- రైస్ కార్డు సర్వీసులు పొందాలి అనుకొనే వారు రైస్ కార్డు కి దరఖాస్తు చేసుకున్న తర్వాత గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా వారు పొందాలి అనుకొనే సర్వీస్ కి సంబంధించి, EKYC చేయించుకోవాలి.
- EKYC పూర్తి అయిన తరువాత మాత్రమే ఆ ప్రక్రియ ముందుకు వెళుతుంది.
- ప్రాథమికంగా గ్రామ రెవెన్యూ అధికారి (VRO) వారు ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేసి, రైస్ కార్డు సర్వీస్ పొందేందుకు అర్హుల కదా అన్నది వారి లాగిన్ లో నిర్ధారిస్తారు.
- చివరిగా తహసీల్దార్ గారు అప్రూవల్ తో రైస్ కార్డు యొక్క సర్వీస్ పూర్తి అవుతుంది.
🔥 వాట్సప్ ద్వారా రైస్ కార్డు సర్వీసులు :
- రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మన మిత్ర వాట్సప్ నెంబర్ ద్వారా వివిధ సర్వీసులు అందిస్తుంది.
- ఇందులో భాగంగా మే నెల రెండవ వారం నుండి రైస్ కార్డు సర్వీసులు పొందేందుకు గాను వాట్సప్ ద్వారా అవకాశం కల్పించాలి అని ప్రభుత్వం భావిస్తుంది.
- ప్రజలందరికీ ఈ అవకాశం కల్పించడం ద్వారా సర్వీసుల్లో పారదర్శకత మరియు ప్రజల యొక్క కాలాన్ని వృథా కాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది అని ప్రభుత్వం భావిస్తుంది.
🔥 జూన్ నుండి స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ :
- ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న రైస్ కార్డుల స్థానం లో స్మార్ట్ రైస్ కార్డులను ప్రవేశపెట్టనుంది.
- QR కోడ్ కలిగిన ఏటీఎం కార్డ్ సైజ్ లో ఉన్న రేషన్ కార్డ్ లను ప్రజలకు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది.
- వచ్చే జూన్ నెల నుండి ఈ స్మార్ట్ రైస్ కార్డులను పంపిణీ చేయనుంది.
🔥 అర్హత కలిగిన ప్రజలకు వీలనంత త్వరగా ఈ రైస్ కార్డు సర్వీసుల గురించి తెలియచేసి, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రాసెసర్ (SOP) ద్వారా ,తగిన కాలపరిమితి లో రైస్ కార్డు సర్వీసులు అందచేయాలి అని అధికారులకు ఆదేశాలు జారీ చేయబడ్డాయి.
👉 Click here to download circular for enable rice card services
👉 Click here to download rice card applications
సంబంధిత సమాచారాన్ని మీకు తెలిసిన వారికి మన ఆర్టికల్ ద్వారా షేర్ చేసి, ఉపయోగపడే విధంగా చేస్తారని ఆశిస్తున్నాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ,కేంద్ర ప్రభుతం పథకాలు & సర్వీసులు ,కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు వంటి వివరాలు కొరకు మన పేజీ ను ఫాలో అవ్వగలరు.