AP New Smart Ration Cards : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుల పంపిణీ కొరకు కీలక అప్డేట్ తెలియజేసింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం పై అధికారిక ప్రకటన చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ప్రకటించిన విధంగా 🏧 కార్డ్ సైజ్ డిజిటల్ కార్డులు (ATM Card Size Digital Ration Cards) పంపిణీ చేయనుంది.
ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
✅ AP Free Bus Scheme Latest News – Click here
🔥 ఆగస్టు 25 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ (Distribution of New Ration Cards from August 25):
:
- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు పంపిణీ ఆగస్టు 25వ తేదీ నుంచి ప్రారంభిస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు తెలియజేశారు.
- రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1.21 కోట్లు (కోటి ఇరవై ఒకటి లక్షల) కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తారు.
- రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయనున్న ఈ కొత్త రేషన్ కార్డులు గతం లో ఉన్న రేషన్ కార్డుల కన్నా వినియోగానికి సులభంగా , ఆకర్షణీయంగా , ఆధునికంగా ఉండనున్నాయి.
- ఆగస్టు 25 నుండి ఆగస్టు 31 వరకు రాష్ట్రంలో గల అన్ని గ్రామాలలో ఈ రేషన్ కార్డుల పంపిణీ జరగనుంది.
🔥 QR కోడ్ కలిగిన ఏటీఎం కార్డ్ సైజ్ లో డిజిటల్ రేషన్ కార్డు (Digital ration card in ATM card size with QR code) :
- రాష్ట్ర ప్రభుత్వం అందచేయనున్న ఈ రేషన్ కార్డు చాలా వినూత్నంగా ఉండనుంది.
- ఈ కార్డ్ ATM కార్డ్ సైజ్ కలిగి ఉండి , QR కోడ్ ఉంటుంది. అలానే కార్డ్ పై ఎటువంటి రాజకీయ నాయకుల యొక్క ఫోటోలు ముద్రించకుండా కుటుంబ సభ్యుల వివరాలను కలిగి ఉంటాయి.
- ఈ రేషన్ కార్డ్ పంపిణీ కి సంబంధించి అధికారులకు ఆదేశాలు జారీ చేయబడ్డాయి.