ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సరం సప్లమెంటరీ పరీక్షలు ఇటీవల ముగిశాయి. పరీక్షలు రాసిన అభ్యర్థులు ఫలితాలు కోసం ఎదురుచూస్తున్నారు.
మొదటి సంవత్సరం పరీక్ష రాసిన వారిలో కొంతమంది విద్యార్థులు తాము ఫెయిల్ అయిన సబ్జెక్టులలో పాస్ కావాలి అని సప్లిమెంటరీ రాశారు. మరి కొంతమంది విద్యార్థులు అన్ని సబ్జెక్టులు పాస్ అయినప్పటికీ తమ మార్కులు పెంచుకునేందుకు బెటర్మెంట్ పరీక్షలు రాశారు.
ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరంలో ఫెయిల్ అయిన విద్యార్థులు వాటిని పూర్తిచేసి డిగ్రీ లేదా బీటెక్ లో జాయిన్ అయ్యేందుకు సెకండియర్ సప్లమెంటరీ పరీక్షలు రాయడం జరిగింది.
ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఎప్పుడు ? (AP Intermediate Supplementary Exam Results 2025)
పరీక్షలు ముగియడంతో మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాలు కోసం పరీక్షలు రాసిన విద్యార్థులు ప్రస్తుతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఈ ఫలితాలను సాధ్యమైనంత త్వరగా విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. జూన్ మొదటి వారంలో ఈ ఫలితాలు విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇందులో భాగంగా ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు జవాబు పత్రాల మూల్యాంకనం కూడా ప్రారంభించారు. సాధ్యమైనంత త్వరగా మూల్యాంకనం పూర్తి చేసి విద్యార్థుల మార్కులను కంప్యూటరీకరణ చేసి త్వరలో ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కాబట్టి జూన్ మొదటి వారంలో ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండో సంవత్సరం ఫలితాలు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.
🏹 పదో తరగతి అర్హతతో విద్యా, ఉద్యోగ అవకాశాలు – Click here
🏹 ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల వివరాలు :
ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ttps://resultsbie.ap.gov.in/ అనే వెబ్సైట్ మరియు మన మిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా తెలుసుకోవచ్చు.