ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు శుభవార్త ! ఇంటర్మీడియట్ విద్యార్హత తో ఉద్యోగాలు భర్తీ కొరకు మంచి నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ది క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (CID), ఆంధ్రప్రదేశ్ నుండి 28 హోమ్ గార్డ్ ఉద్యోగాలకు భర్తీ చేసేందుకు గాను ఉద్యోగల నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ఆంధప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అర్హత కలిగిన పురుష మరియు మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి మంగళగిరి లోని CID హెడ్ ఆఫీస్ నందు మరియు విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి మరియు కర్నూలు నందు పనిచేయవలసి వుంటుంది.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి విద్యార్హతలు , దరఖాస్తు విధానం , జీతం మొదలగు పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- ది క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (CID), ఆంధ్రప్రదేశ్ ఈ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- హోంగార్డు (కేటగిరి – బి ఎ టెక్నికల్ & అదర్ ట్రేడ్స్) ఉద్యోగాల భర్తీ చేస్తున్నారు.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
- మొత్తం 28 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 విద్యార్హత :
- గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణత సాధించాలి.
🔥 ఇతర అర్హతలు :
- అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ కి చెందిన వారై ఉండాలి.
- డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. (LVM/HVM)
- పురుష అభ్యర్థులు 160 సెంటీమీటర్ల ఎత్తు , మహిళా అభ్యర్థులు 150 సెంటీమీటర్ల కనీస ఎత్తు కలిగి వుండాలి. (ST మహిళ అభ్యర్థులకు 5 సెంటీ మీటర్ల మినహాయింపు కలదు)
- మంచి కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి వుండాలి.
- శారీరికంగా మరియు మానసికంగా దృఢంగా ఉండాలి.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 గరిష్ట వయస్సు :
- 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు ఈ రిక్రూట్మెంట్ కి దరఖాస్తు చేసుకోవచ్చు.
🔥దరఖాస్తు విధానం :
- 01/05/2025 నుండి 15/05/2025 వరకు నేరుగా లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా కార్యాలయ చిరునామాకు చేరవేయాలి.
- అభ్యర్థులు సరైన ఏక్నాలజిమెంట్ తో దరఖాస్తు అందచేయాలి.
🔥 దరఖాస్తు చేరవేయవలసిన చిరునామా :
- The Director General of Police, Crime Investigation Department, Andhra Pradesh, AP Police Headquarters, MANGALAGIRI – 522503.
🔥 అవసరమగు ధ్రువపత్రాలు :
- పూరించిన దరఖాస్తు
- పదవ తరగతి సర్టిఫికెట్ (ఏజ్ ప్రూఫ్ కొరకు)
- ఇంటర్మీడియట్ సర్టిఫికెట్
- మిగతా విద్యార్హత సర్టిఫికెట్లు
- రెసిడెన్స్ సర్టిఫికెట్
- కాస్ట్ సర్టిఫికెట్
- డ్రైవింగ్ లైసెన్స్ (LVM/HVM)
- కంప్యూటర్ సర్టిఫికేషన్స్
- రెండు ఇటీవల పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు
- ఏమైనా ఇతర టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్
🔥 ఎంపిక విధానం :
- ఈ క్రింది పేర్కొన్న స్టేజ్ ల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- దరఖాస్తుల పరిశీలన
- సర్టిఫికెట్ వెరిఫికేషన్
- ఫిజికల్ మెస్యూర్మెంట్ టెస్ట్
- స్కిల్ టెస్ట్ : కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ & డ్రైవింగ్ టెస్ట్ నిర్వహిస్తారు.
🔥 జీతం :
- ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి రోజుకు 710/- రూపాయల డ్యూటీ అలవెన్స్ లభిస్తుంది.
🔥 ముఖ్యమైన తేదిలు :
- దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 01/05/2025
- దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 15/05/2025
సంబంధిత సమాచారాన్ని మీకు తెలిసిన వారికి మన ఆర్టికల్ ద్వారా షేర్ చేసి, ఉపయోగపడే విధంగా చేస్తారని ఆశిస్తున్నాం.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ,కేంద్ర ప్రభుతం పథకాలు & సర్వీసులు ,కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు వంటి వివరాలు కొరకు మన పేజీ ను ఫాలో అవ్వగలరు.
👉 Click here to download Application & Notification
👉 Click here for official website