ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో 689 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు | AP Forest Beat Officer Notification 2025 | APPSC Forest Beat Officer Notification 2025

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో అటవీశాఖ నుండి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ నిమిత్తం నోటిఫికేషన్లు విడుదల అవ్వనున్నాయి.

మొత్తం అటవీ శాఖలో 689 భర్తీ చేసేందుకు గాను ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఇప్పటికే ఈ పోస్టులు భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి కూడా ఇచ్చింది.. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ పూర్తయిన నేపథ్యంలో ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి రోస్టర్ పాయింట్లు వివరాలతో అటవీ శాఖ నుండి ఏపీపీఎస్సీకి నివేదిక అందితే నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిద్ధంగా ఉంది.

అభ్యర్థుల అవగాహన కోసం ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి అవసరమగు విద్యార్హతలు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం మొదలగు అన్ని అంశాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) సంస్థ ఈ నోటిఫికేషన్ ప్రకటించబడింది.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య: 

689  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు

ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 విద్యార్హత: 

ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

🔥 ఫిజికల్ మేజర్మెంట్స్:

పురుషులు కనీసం 163 సెంటీమీటర్ల పొడవు కలిగి వుండాలి మరియు కనీసం 84 సెంటీమీటర్ల ఛాతి కలిగి కనీసం 5 సెంటీమీటర్ల విస్తరణ వచ్చి వుండాలి.

మహిళలు 150 సెంటీమీటర్ల పొడవు కలిగి వుండాలి.

ఎత్తు కి తగ్గ బరువు కలిగి వుండాలి.

🔥  వయస్సు :

18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, EWS అభ్యర్థులకు వయో సడలింపు కలదు.

🔥దరఖాస్తు విధానం :

అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.

🔥 ఎంపిక విధానం:

వ్రాత పరీక్ష మరియు ఫిజికల్ ఎఫిసియన్సీ టెస్ట్ నిర్వహించి అభ్యర్థులను మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 జీతం:

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి 35,000/- రూపాయల బేసిక్ పే తో పాటు అన్ని అలవెన్సులు లభిస్తాయి.

🔥 ముఖ్యమైన అంశాలు:

రాష్ట్ర ప్రభుత్వం నుండి నోటిఫికేషన్ల విడుదల కొరకు ఇటీవల ఎస్సీ ఉప వర్గీకరణ అంశం కూడా పూర్తి అయ్యింది.

ఇటీవలే 16347 టీచర్ ఉద్యోగాల భర్తీ కొరకు DSC నోటిఫికేషన్ కూడా విడుదల అయ్యింది.

నోటిఫికేషన్ విడుదల తర్వాత ప్రిపరేషన్ కు  తక్కువ సమయం మాత్రమే అందుబాటులో ఉంటుంది కావున అభ్యర్థులు సిలబస్ ను ప్రామాణికంగా చేసుకొని ఇప్పటినుండే ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ కాగలరు.

అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత మరో ఆర్టికల్ లో పూర్తి సమాచారాన్ని తెలియచేయడం జరుగును.

సంబంధిత సమాచారాన్ని మీకు తెలిసిన వారికి మన ఆర్టికల్ ద్వారా షేర్ చేసి, ఉపయోగపడే విధంగా చేస్తారని ఆశిస్తున్నాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ,కేంద్ర ప్రభుతం పథకాలు & సర్వీసులు ,కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు వంటి వివరాలు కొరకు మన పేజీ ను ఫాలో అవ్వగలరు.

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *