ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో ఉన్న ECHS సెల్ హెడ్ క్వార్టర్స్ నుండి కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు భర్తీ కోసం అర్హత ఉన్నవారి నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎక్స్ సర్వీస్మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ హాస్పిటల్స్ నందు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. విశాఖపట్నం, కాకినాడ, శ్రీకాకుళం మరియు విజయనగరం ప్రాంతాల్లో ఉన్న ECHS హాస్పిటల్స్ నందు ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలు నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి.
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మెడికల్ ఆఫీసర్స్, మెడికల్ స్పెషలిస్ట్, ఫార్మసిస్ట్, డెంటల్, డ్రైవర్ మరియు ప్యూన్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులకు సెల్ఫ్ అటిస్టెడ్ జిరాక్స్ కాపీలు జతపరిచి అప్లై చేయాలి.

అప్లికేషన్స్ సబ్మిట్ చేయాల్సిన చిరునామా :
QIC, Stb HQ (ECHS Cell), Nausena Baugh, PO-Gandhigram, Visakhapatnam, Andhra Pradesh – 530005
అప్లికేషన్ చివరి తేదీ :
ఈ పోస్టులకు అర్హతలు కలిగిన వారు 12-12-2025 తేదీలోపు తమ దరఖాస్తులను అందజేయాలి.
