ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డీఎస్సీ పరీక్షలు ముగిశాయి. ఇప్పుడు అభ్యర్థులు డిఎస్సీ పరీక్ష ఫలితాలు (AP DSC Results 2025). జూన్ 6వ తేదీ నుండి జూలై 2వ తేదీ వరకు మెగా డీఎస్సీ పరీక్షలు ప్రతి రోజు రెండు సెషన్లలో నిర్వహించారు. యోగేంద కార్యక్రమం కారణంగా జూన్ 20 మరియు 21 తేదీల్లో నిర్వహించాల్సిన డీఎస్సీ పరీక్షలను జూలై 1 మరియు 2 తేదీల్లో నిర్వహించారు. డీఎస్సీ పరీక్షలకు మొత్తం 92.90% మంది అభ్యర్థులు హాజరయ్యారు.
వివిధ ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు మీ మొబైల్ కి రావాలి అంటే మా టెలిగ్రామ్ గ్రూప్లో వెంటనే జాయిన్ అవ్వండి.
AP DSC Results 2025 :
ఏపీ డీఎస్సీ పరీక్షలను నోటిఫికేషన్ విడుదల చేసిన సమయంలో తెలియజేసినట్లుగానే నిర్వహించడం జరిగింది. కాబట్టి పరీక్ష ఫలితాలను నోటిఫికేషన్ విడుదల చేసిన సమయంలో తెలియజేసినట్లు గాని ఆగస్టు రెండవ వారంలో విడుదల చేయబోతున్నారు.
ఇప్పటికే పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక “కి” మరియు రెస్పాన్స్ సీట్లను కూడా విడుదల చేస్తూ ఉన్నారు.
ఏపీ డీఎస్సీ పరీక్ష ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలు సంఖ్య :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా 16,347 ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేస్తోంది. ఏప్రిల్ 15వ తేదీ నుండి మే 20వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 3,36,307 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. జూన్ 6వ తేదీ నుండి జూలై రెండవ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే కాకుండా తెలంగాణ , కర్ణాటక, తమిళనాడు, ఒడిస్సా రాష్ట్రాల్లో కూడా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
🏹 Official Website – Click here