ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డీఎస్సీ పరీక్షలు జూన్ 06 నుండి పరీక్షలు నిర్వహించగా లక్షల మంది అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు పోటీ పడ్డారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 16 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే.
పరీక్షలు ముగిసిన నేపథ్యంలో మెగా డీఎస్సీ కీ ప్రాథమిక కీ విడుదల చేశారు. పరీక్ష రాసిన అభ్యర్థులు తమ రెస్పాన్స్ షీట్ ( AP DSC Response Sheet 2025) డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అంటే వెంటనే మా వాట్సాప్ గ్రూపులో జాయిన్ అవ్వండి..
✅ Join Our What’s App Group – Click here
🔥మెగా డీఎస్సీ పరిక్ష ప్రాధమిక కీ విడుదల ((AP DSC Preliminary Key) :
- మెగా డీఎస్సీ కి సంబంధించి ప్రాధమిక కీ మరియు రెస్పాన్స్ షీట్లు ను గురువారం నుండి అందుబాటులో ఉంచినట్లు మెగా డీఎస్సీ కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి గారు తెలియచేసారు.
- జూన్ 06 వ తేదీ నుండి జూన్ 28 వరకు నిర్వహించిన పరీక్షల కీ విడుదల చేశారు.
- PGT కామర్స్ , ఇంగ్లీష్ , హిందీ , ఫిజిక్స్, తెలుగు, ఇంగ్లీష్ భాషా ప్రావీణ్య పరీక్ష , స్పెషల్ PET , జనరల్ PET పరీక్షల యొక్క కీ మరియు రెస్పాన్స్ షీట్లు అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచారు.
- అభ్యర్థులు ప్రాధమిక కీ , రెస్పాన్స్ షీట్లు చెక్ చేసుకొని అభ్యంతరాలను ఈ నెల 11 లోపు పంపించాలి అని తెలియచేశారు.
- మిగతా పరీక్షల యొక్క రెస్పాన్స్ షీట్లు , కీ ను మరికొద్ది రోజులలో విడుదల చేయనున్నారు.
🏹 Official Website – Click here