AP DSC Latest News Today | AP DSC Updates | AP DSC Last Date | AP DSC Notification 2025

AP DSC Notification 2025
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలను పొందాలనుకునే అభ్యర్థులకు అలర్ట్ ! మెగా డిఎస్సీ – 2025 నోటిఫికేషన్ కి సంబంధించి అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ మే 15 సమీపిస్తున్నందున ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోకపోతే వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోగలరు. 

🔥 మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల: 

విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు మరియు విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ గారు గతంలోనే ప్రకటించడం జరిగింది.

దీనికి అనుగుణంగా డీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేయడం జరిగింది.

ఉపాధ్యాయుల ఎంపికలు సమానత్వం మరియు ప్రాతినిధ్యం కొరకు ఎస్సీ ఒక వర్గీకరణ కూడా అమలు చేయడం జరిగింది.

మొత్తం 16,347 పోస్టుల భర్తీ కొరకు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల నిమిత్తమై సీఎం చంద్రబాబు నాయుడు గారు తన తొలి సంతకాన్ని చేయడం జరిగింది.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 వీలనంత త్వరగా దరఖాస్తు చేసుకోండి :

చాలామంది అభ్యర్థులు చాలా సందేహాల నడుమ ఈ డీఎస్సీ నోటిఫికేషన్కు దరఖాస్తు చేసుకోవడానికి సంకోచిస్తున్నారు. 

అయితే ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత నుండి కూడా ప్రతి సందేహాన్ని నివృత్తి చేస్తూ క్లారిఫికేషన్లు విడుదల చేస్తూ అభ్యర్థులకు ప్రోత్సాహాన్ని అందిస్తుంది. 

ఇంటి పేరు, కుల ధ్రువీకరణ పత్రం, ఫీజ్ పేమెంట్, గతంలో దరఖాస్తు చేసుకున్న వారు మరల దరఖాస్తు చేయాలా వద్దా వంటి అన్ని అంశాలను మరియు పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ను కూడా అభ్యర్థుల యొక్క విన్నపాలను పరిగణలోనికి తీసుకుంటూ వివిధ సడలింపులు ఇచ్చింది. 

కావున అభ్యర్థులు మే 15వ తారీకులోగా కచ్చితంగా దరఖాస్తు చేసుకోవాలి.

సర్వర్లు మొరాయించక ముందే అభ్యర్థులందరూ కూడా వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం.

🔥 జూన్ 06 నుండి డీఎస్సీ పరీక్షలు ప్రారంభం:

ప్రభుత్వం గతంలో ప్రకటించిన విధంగానే నోటిఫికేషను విడుదలైన 40  నుంచి 50 రోజుల్లోగా పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. 

మే 15 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ప్రకటించగా, జూన్ 6వ తేదీ నుండి కచ్చితంగా పరీక్షలు నిర్వహించనుంది.

అభ్యర్థుల సౌకర్యార్థం మరియు అభ్యర్థులు మరింత సంసిద్ధంగా ప్రిపేర్ అయ్యే విధంగా ఉండేందుకుగాను నవంబర్ 2024 లోని సిలబస్ ను అధికారికంగా వెబ్సైట్ లో పొందుపరిచారు.

🔥 ముఖ్యమైన అంశాలు: 

అభ్యర్థులు వీలైనంత త్వరగా డీఎస్సీ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకొని సిలబస్ ను ప్రామాణికంగా చేసుకొని ప్రిపేర్ అవ్వగలరు. 

సమయం తక్కువగా ఉన్నందువలన అభ్యర్థులందరూ కూడా తప్పనిసరిగా మాక్ టెస్ట్ లు , మోడల్ టెస్టులు వంటివి రాస్తూ మీ యొక్క ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేసుకోగలరు.

కంటెంట్ కు మరియు మెథడాలజీకి సమాన ప్రాధాన్యత ఇస్తూ ప్రిపేర్ అయ్యి ఉద్యోగ సాధనకు కృషి చేయగలరు.

 సంబంధిత సమాచారాన్ని మీకు తెలిసిన వారికి మన ఆర్టికల్ ద్వారా షేర్ చేసి, ఉపయోగపడే విధంగా చేస్తారని ఆశిస్తున్నాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం , కేంద్ర ప్రభుత్వం పథకాలు & సర్వీసులు, కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు వంటి వివరాలు తెలుసుకునేందుకు ప్రతిరోజు మా వెబ్సైట్ ఓపెన్ చేయండి.

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!