AP District Court Office Subordinate Jobs Notification 2025 | AP High Court Jobs | AP Court Jobs Syllabus 

AP District Court Office Subordinate Jobs Notification 2025

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి 1620 ఉద్యోగాల భర్తీ నిమిత్తం పలు నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి.

ఇందులో భాగంగా ఆఫీస్ సబార్డినేట్ అనే ఉద్యోగాలు కూడా  భర్తీ చేస్తున్నారు. హైకోర్టు విడుదల చేసిన అన్ని ఉద్యోగాలలో అతి ఎక్కువగా ఈ ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. 

అన్ని జిల్లాలలో కలిపి మొత్తం 651 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. కేవలం 7వ తరగతి ఉత్తీర్ణత తో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : 

  • ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి ఈ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. (నోటిఫికేషన్ నెంబర్ :10/2025 dated:06/052025)

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :

  • పాత జిల్లాల ప్రాధిపతికన మొత్తం 13 జిల్లాలో కలిపి 651 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :

  • ఆఫీస్ సబార్డినేట్ – 651 ఉద్యోగాలు ను శాశ్వత ప్రాదిపాదికన భర్తీ చేస్తున్నారు.

🔥 జిల్లాల వారీగా ఖాళీల వివరాలు : 

  1. అనంతపురం – 43
  2. చిత్తూరు – 85
  3. తూర్పు గోదావరి – 43
  4. గుంటూరు – 60
  5. కృష్ణా – 52
  6. కర్నూలు – 55
  7. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు – 49
  8. ప్రకాశం – 59
  9. శ్రీకాకుళం – 33
  10. విశాఖపట్నం – 73
  11. విజయనగరం – 30
  12. పశ్చిమ గోదావరి – 17
  13. వైఎస్ఆర్ కడప – 52

🔥 విద్యార్హత : 

  • ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే ఉద్యోగాలు 7వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి.
  • అభ్యర్థులు ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత లో ఫెయిల్ అయి వుండాలి.
  • ఇంతకి మించి విద్యార్హత కలిగి వున్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కారు.
  • అభ్యర్థులకు కుకింగ్, కార్పెంటరీ, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ మరియు పెయింటింగ్ వంటి నైపుణ్యాలు వచ్చి ఉంటే దరఖాస్తు చేసేటప్పుడు ప్రస్తావించాలి.

🔥 భాషా అర్హత :

  • దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వారు దరఖాస్తు చేయు జిల్లాకు సంబంధించిన స్థానిక భాషలపై ప్రావీణ్యం కలిగి ఉండాలి. 
  • అనంతపురం జిల్లా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి తెలుగు భాషతో పాటుగా కన్నడ భాష పై కూడా అవగాహన ఉండాలి. 
  • చిత్తూరు జిల్లాలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న తెలుగు భాషతో పాటుగా తమిళం భాష పై అవగాహన ఉండాలి.
  • శ్రీకాకుళం మరియు విజయనగరం జిల్లాలలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి తెలుగు భాషతో పాటుగా ఒరియా భాష పై అవగాహన కలిగి ఉండాలి. 
  • మిగతా అన్ని జిల్లాల వారు కూడా కేవలం తెలుగు భాష పై అవగాహన ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

 🔥  వయో పరిమితి :

  • అర్హత కలిగిన అభ్యర్థులు 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఎస్సీ,  ఎస్టీ, బీసీ,  EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు &  దివ్యాంగులు కి 10 సంవత్సరాలు & ఎక్స్ సర్వీస్ మెన్ లకు ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ మరియు సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారం వయో సడలింపు కలదు.
  • వయస్సు నిర్ధారణ కొరకు 01/07/2025 ను కట్ ఆఫ్ తేది గా నిర్ణయించారు.

🔥దరఖాస్తు విధానం : 

  • అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.

🔥 అవసరమగు ధ్రువపత్రాలు :

  1. డేట్ ఆఫ్ బర్త్ కొరకు సంబంధిత ధ్రువపత్రం
  2. కుల ధ్రువీకరణ పత్రం
  3. ఓబీసీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్ (సంబంధిత వర్గాల వారు)
  4. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ (సంబంధిత వర్గాల వారు)
  5. డిసబిలిటీ సర్టిఫికెట్ (దివ్యాంగులు)
  6. ఎక్స్ సర్వీస్ మెన్ వారు డిశ్చార్జ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. 
  7. స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలు కలిగి ఉండాలి. 
  8. స్థానికత కొరకు 4వ తరగతి నుండి ఏడవ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు కలిగి ఉండాలి. 

🔥 అప్లికేషన్ ఫీజు :

  • అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు ఫీజు ను చెల్లించాలి.
  • ఓసి, బిసి, EWS, అభ్యర్థులు 800/- రూపాయలు & ఎస్సీ, ఎస్టీ ,  దివ్యాంగులు 400/- రూపాయలు దరఖాస్తు ఫీజు ను చెల్లించాలి.

🔥 ఎంపిక విధానం :

  • ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్  ఆధారిత వ్రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.
  • ఈ వ్రాత పరీక్షలో వారి కనీస విద్యార్హత ఆధారిత స్థాయి ప్రశ్నలు అడుగుతారు.
  • వ్రాత పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

🔥 పరీక్షా విధానం : 

  • 90 నిముషాల కాలపరిమితి తో 80 బహుళైచ్చిక ప్రశ్నలు పరీక్షలో ఇస్తారు.
  • ఇందులో జనరల్ నాలెడ్జ్ 40 ప్రశ్నలు & జనరల్ ఇంగ్లీష్ 10 ప్రశ్నలు & మెంటల్ ఎబిలిటీ నుండి 30 ప్రశ్నలు వుంటాయి.
  • ప్రతీ ప్రశ్నకు ఒక్కో మార్కు కేటాయించారు.

🔥 జీతం :

  • అభ్యర్థులు ఎంపిక కాబడిన పోస్ట్ ఆధారంగా వారికి ఉద్యోగానికి ఎంపిక అయిన ప్రారంభం లోనే 30,000/- వేలకు పైగా జీతం లభిస్తుంది మరియు వివిధ అలోవేన్స్ లు కూడా లభిస్తాయి.

 🔥 ముఖ్యమైన తేదిలు :

  • నోటిఫికేషన్ విడుదల అయిన తేది : 06/05/2025
  • ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది : 13/05/2025
  • ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది : 02/06/2025

🔥 హెల్ప్ డెస్క్ వివరాలు :

  • ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల సందేహాల నివృత్తి కొరకు హెల్ప్ డెస్క్ అందుబాటులో ఉంటుంది. 
  • అభ్యర్థులు ఇమెయిల్ ఐడి: helpdesk-hc.ap@aij.gov.in & టెలిఫోన్ నెంబర్ : 0863 – 2372752 కు సంప్రదించి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. 
  • ఉదయం 10:30 నిముషాల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు హెల్ప్ డెస్క్ అందుబాటులో ఉంటుంది. (మధ్యాహ్నం 01:30 నుండి 02:15 వరకు లంచ్ బ్రేక్)

👉  Click here for Notification

👉 Click here for official website

సంబంధిత సమాచారాన్ని మీకు తెలిసిన వారికి మన ఆర్టికల్ ద్వారా షేర్ చేసి, ఉపయోగపడే విధంగా చేస్తారని ఆశిస్తున్నాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ,కేంద్ర ప్రభుతం పథకాలు & సర్వీసులు ,కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు వంటి వివరాలు కొరకు మన పేజీ ను ఫాలో అవ్వగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!