ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త! ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగాల కొరకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి అన్ని జిల్లాల్లో ఉన్నాయి జిల్లా కోర్టుల్లో వివిధ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి.
ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఆఫీస్ సబార్డినేట్, టైపిస్ట్, ఎగ్జామినర్, ఫీల్డ్ అసిస్టెంట్లు, ప్రాసెస్ సర్వర్, కాపీస్ట్,జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, డ్రైవర్, రికార్డు అసిస్టెంట్ వంటి వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయబోయే ఈ ఉద్యోగాలకు 10వ తరగతి, ఇంటర్మీడియెట్, డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ రిక్రూట్మెంట్ ద్వారా 1620 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి ఈ నోటిఫికేషన్లు విడుదల కావడం జరిగింది.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
- మొత్తం అన్ని ఉద్యోగాలు కలిపి 1620 పోస్టులను భర్తీ చేస్తున్నారు.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- జూనియర్ అసిస్టెంట్ – 230 ఉద్యోగాలు
- ఆఫీస్ సబార్డినేట్ – 651 ఉద్యోగాలు
- ప్రాసెస్ సర్వర్ – 164 ఉద్యోగాలు
- రికార్డు అసిస్టెంట్ – 24 ఉద్యోగాలు
- కాపీయిస్ట్ – 193 ఉద్యోగాలు
- ఎగ్జామినర్ – 32 ఉద్యోగాలు
- ఫీల్డ్ అసిస్టెంట్ – 56 ఉద్యోగాలు
- టైపిస్ట్ – 162 ఉద్యోగాలు
- స్టెనోగ్రాఫర్ – 80 ఉద్యోగాలు
- డ్రైవర్ – 28
🔥 విద్యార్హత :
- ఈ ఉద్యోగాలకు పోస్టులను అనుసరించి 7వ తరగతి, పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఫీల్డ్ అసిస్టెంట్ – ఏదైనా డిగ్రీ
- టైపిస్ట్ – ఏదైనా డిగ్రీ
- స్టెనోగ్రాఫర్ – ఏదైనా డిగ్రీ
- రికార్డ్ అసిస్టెంట్ – ఇంటర్మీడియట్
- ప్రాసెస్ సర్వర్ -10వ తరగతి
- ఆఫీస్ సబార్డినేట్ – ఏడవ తరగతి
- జూనియర్ అసిస్టెంట్ – ఏదైనా డిగ్రీ
- ఎగ్జామినర్ – ఇంటర్మీడియట్
- డ్రైవర్ – 7 వ తరగతి
- కాపీస్ట్ – ఇంటర్మీడియట్
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 వయస్సు :
- 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులు కి 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
- వయస్సు నిర్ధారణ కొరకు 01/07/2025 ను కట్ ఆఫ్ తేది గా నిర్ణయించారు.
🔥దరఖాస్తు విధానం :
- అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వార అధికారిక వెబ్సైట్ లో 13-05-2025 నుండి 02-06-2025 తేది దరఖాస్తు చేసుకోవాలి.
🔥 అప్లికేషన్ ఫీజు:
- అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు ఫీజు ను చెల్లించాలి.
- ఓసి, బిసి, EWS, అభ్యర్థులు 800/- రూపాయలు & ఎస్సీ, ఎస్టీ , దివ్యాంగులు 400/- రూపాయలు దరఖాస్తు ఫీజు ను చెల్లించాలి.
🔥 ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఓఏంఆర్ ఆధారిత వ్రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.
- ఈ వ్రాత పరీక్షలో వారి కనీస విద్యార్హత ఆధారిత స్థాయి ప్రశ్నలు అడుగుతారు.
- వ్రాత పరీక్ష తర్వాత 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్ & మౌఖిక ఇంటర్వ్యూ కు పిలుస్తారు.
🔥 జీతం :
- అభ్యర్థులు ఎంపిక కాబడిన పోస్ట్ ఆధారంగా వారికి ఉద్యోగానికి ఎంపిక అయిన ప్రారంభం లోనే 30,000/- వేలకు పైగా జీతం లభిస్తుంది మరియు వివిధ అలోవేన్స్ లు కూడా లభిస్తాయి.
🔥 నోట్ :
- ఈ ఉద్యోగాలకు సంబంధించి పోస్ట్ ను అనుసరించి , నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి.
- క్రింద ఇవ్వబడిన లింక్ లో అన్ని అధికారిక నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి , ఆ పోస్ట్ కి అర్హత , ఆసక్తి వుంటే దరఖాస్తు చేసుకోగలరు.
- అభ్యర్థులు అర్హత వుంటే ఒకటికి మించి పోస్టులకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- ప్రతి నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి నోటిఫికేషన్ వివరాలను విడివిడిగా ఒక్కొక్క నోటిఫికేషన్ కి ఒక్కో ఆర్టికల్ రూపంలో మీకు తెలియజేయడం జరుగుతుంది.
🔥 ముఖ్యమైన తేదిలు :
- నోటిఫికేషన్లు విడుదల అయిన తేది : 06/05/2025
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది : 13/05/2025
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది : 02/06/2025
👉 Click here for notifications
👉 Click here for official website
సంబంధిత సమాచారాన్ని మీకు తెలిసిన వారికి మన ఆర్టికల్ ద్వారా షేర్ చేసి, ఉపయోగపడే విధంగా చేస్తారని ఆశిస్తున్నాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ,కేంద్ర ప్రభుతం పథకాలు & సర్వీసులు ,కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు వంటి వివరాలు కొరకు మన పేజీ ను ఫాలో అవ్వగలరు.