Andhra Pradesh Court Jobs Recruitment 2026 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కోర్టుకు సంబంధించిన డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అధారిటీ లలో పదో తరగతి, డిగ్రీ వంటి విద్యార్హతలతో రికార్డ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జిల్లాల వారీగా విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్స్ ఉమ్మడి 13 జిల్లాల్లో విడుదల చేయడం జరిగింది. అనగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల నుంచి ఈ నోటిఫికేషన్స్ విడుదల అయ్యాయి.
రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్స్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అర్హత ఉంటే అప్లై చేయండి.
✅ ఏపీలో ఉన్న ప్రభుత్వ బోర్డులో ఉద్యోగాలు – Click here
Table of Contents :
రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీ చేసిన సంస్థ :
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జిల్లా లీగల్ సర్వీసెస్ అధారిటీల నుండి జిల్లాల వారీగా ఈ నోటిఫికేషన్స్ విడుదల చేశారు.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
రికార్డు అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. అన్ని జిల్లాల్లో కలిపి భర్తీ చేస్తున్న ఉద్యోగాల సంఖ్య వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ ఉద్యోగాలను ఉమ్మడి 13 జిల్లాల్లో ఒక్కొక్క పోస్టు చొప్పున భర్తీ చేస్తున్నారు.
రికార్డు అసిస్టెంట్ ఉద్యోగాలు ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి.
రికార్డు అసిస్టెంట్ ఉద్యోగాలు – 18 పోస్టులు
డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు – 13 పోస్టులు
ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ – 13 పోస్టులు
విద్యార్హత వివరాలు :
రికార్డు అసిస్టెంట్ ఉద్యోగాలకు పదో తరగతి అర్హతతో అప్లై చేయవచ్చు.
డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు డిగ్రీ అర్హతతో పాటు కంప్యూటర్, టైపింగ్ మరియు బ్రౌజింగ్ పరిజ్ఞానం ఉండాలి.
ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉన్న వారు అర్హులు.
వయస్సు వివరాలు :
18 సంవత్సరాలు నుండి 42 సంవత్సరాలు మధ్య వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.
SC, ST, BC, EWS అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది.
PWD అభ్యర్థులకు వయస్సులో పదేళ్లు సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్ ఫీజు వివరాలు :
OC, BC, EWS అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 1000/- రూపాయలు ఫీజు చెల్లించి అప్లై చేయాలి.
SC, ST, PWD అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 500/- రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించి అప్లై చేయాలి.
జీతము వివరాలు :
రికార్డు అసిస్టెంట్ ఉద్యోగాలు 23,120/- నుండి 74,770/- వరకు ఉండే పే స్కేల్ ప్రకారం జీతం చెల్లిస్తారు.
డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు 28,280/- నుండి 89,720/- వరకు ఉండే పే స్కేల్ ప్రకారం జీతం చెల్లిస్తారు.
ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ ఉద్యోగాలకు 25,220/- నుండి 80,190/- వరకు ఉండే పే స్కేల్ ప్రకారం జీతం చెల్లిస్తారు.
అప్లికేషన్ తేదీలు :
అర్హత గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అన్ని జిల్లాల్లో కూడా 27-01-2026 తేదీలోపు అప్లై చేయాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం వివరాలు :
రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులు రాత పరీక్ష, ఇంటర్వ్యూ మరియు స్కిల్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు.
ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక :
అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు క్రింద జిల్లాల వారీగా ఇచ్చిన లింక్స్ ఉపయోగించి నోటిఫికేషన్స్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి.
✅ Srikakulam District Notification – Click here
✅ Vishakhapatnam District Notification – Click here
✅ Vizayanagaram District Notification – Click here
✅ East Godavari District Notification – Click here
✅ West Godavari District Notification – Click here
✅ Krishna District Notification – Click here
✅ Guntur District Notification – Click here
✅ Prakasam District Notification – Click here
✅ Nellore District Notification – Click here
✅ Kadapa District Notification – Click here
✅ Kurnool District Notification – Click here
✅ Chittoor District Notification – Click here
✅ Ananthapur District Notification – Click here
