AP Contract jobs Notification : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం , హెల్త్ మెడికల్ & ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కృష్ణా జిల్లా నుండి వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు రెండు నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా ల్యాబ్ టెక్నీషియన్ , ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ , శానిటరీ అటెండెంట్ కం వాచ్మెన్ మరియు ఫార్మసిస్ట్ , డేటా ఎంట్రీ ఆపరేటర్ , లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ ఉద్యోగాలను ఔట్ సోర్సింగ్ , కాంట్రాక్ట్ ప్రాధిపతికన భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు అనగా అవసరమగు విద్యార్హతలు , ఎంపిక విధానం , దరఖాస్తు విధానం వంటి వివిధ అంశాల సమగ్ర సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
✅ రైల్వేలో 10th అర్హతతో 22,000 ఉద్యోగాలు – Click here
Table of Contents :
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ , కృష్ణా జిల్లా వారు నుండి ఈ ఉద్యోగ నోటిఫికేషన్ లు విడుదల అయ్యాయి.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాల సంఖ్య :
- ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 60 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 – 12
- ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ – 16
- శానిటరీ అటెండెంట్ కం వాచ్మెన్ – 10
- ఫార్మాసిస్ట్ – 01
- ల్యాబ్ టెక్నీషియన్ – 07
- డేటా ఎంట్రీ ఆపరేటర్ – 04
- లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ – 10
🔥 అవసరమగు విద్యార్హతలు :
- ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ : పదవ తరగతి లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి.
- శానిటరీ అటెండెంట్ కం వాచ్మెన్ : పదవ తరగతి లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి.
- ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 : పదవ తరగతి ఉత్తీర్ణత సాధించి , మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ లో డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి లేదా MLT ఇంటర్మీడియట్ వొకేషనల్ పూర్తి చేసి ఒక సంవత్సరం అప్రెంటిస్ చేసి ఉండాలి. APPMB నందు రిజిస్టర్ చేసుకొని ఉండాలి.
- లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ : పదవ తరగతి లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి.
- డేటా ఎంట్రీ ఆపరేటర్ : ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి , PGDCA కోర్సు పూర్తి చేసి ఉండాలి లేదా కంప్యూటర్ ఒక సబ్జెక్ట్ గా కలిగి ఉన్న డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి.
- ఫార్మాసిస్ట్: SSC ఉత్తీర్ణత సాధించి , ఫార్మసీ లో డిప్లొమా లేదా B. ఫార్మసీ ఉత్తీర్ణత సాధించాలి. ఏపీ ఫార్మసీ కౌన్సిల్ నందు రిజిస్టర్ అయి ఉండాలి.
🔥 వయో పరిమితి:
- 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఎస్సీ , ఎస్టీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
- ఎక్స్ సర్వీస్ మాన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
🔥 దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు ఆఫ్లైన్ విధానం లో దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్ లో ఇచ్చిన దరఖాస్తును ఫిల్ చేసి , కృష్ణ జిల్లా DM & HO కార్యాలయంనకు తేదీ 31/12/2025 సాయంత్రం 05:00 గంటల లోగా అందించాలి.
🔥 దరఖాస్తు తో పాటు సమర్పించవలసిన ధ్రువపత్రాలు :
- పదవ తరగతి లేదా తత్సమాన విద్యార్హత సర్టిఫికెట్
- విద్యార్హత సర్టిఫికెట్లు
- విద్యార్హత కి సంబంధించిన అన్ని మార్క్స్ మెమోలు
- ఏపీ పారా మెడికల్ బోర్డు / హెల్త్ కేర్ సైన్సెస్ / ఇతర కౌన్సిల్స్ నందు రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి.
- 4 వ తరగతి నుండి 10 తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు
- ఇటీవల కుల ధృవీకరణ పత్రం ( అవసరమగు వారు )
- ఇటీవల EWS సర్టిఫికెట్ ( అవసరమగు వారు )
- సదరం సర్టిఫికెట్ ( అవసరమగు వారు )
- సర్వీస్ సర్టిఫికెట్ ( గతంలో సర్వీస్ లో ఉన్న వారు )
🔥దరఖాస్తు ఫీజు :
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా ఫీజు చెల్లించాలి.
- “District medical & helath officer , krishna district” పేరు మీదుగా డిమాండ్ డ్రాఫ్ట్ చేసి ఫీజు చెల్లించాలి.
- ఓసి , బిసి , ఈడబ్ల్యూ ఎస్ అభ్యర్థులు 300 రూపాయలు & ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 100 రూపాయలు చెల్లించాలి.
- దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు లభిస్తుంది.
🔥ఎంపిక విధానం :
- మొత్తం 100 మార్కులకు గాను 75 శాతం మార్కులు వారి యొక్క విద్యార్హత కి కేటాయించారు.
- విద్యార్హత సాధించిన సంవత్సరం ఆధారంగా ఒక్కో సంవత్సరానికి ఒక్కో మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కులు కేటాయించారు.
- గతంలో పనిచేసిన అనుభవానికి గరిష్టంగా 15 మార్కులు కేటాయించారు.
🔥 జీతం :
- ల్యాబ్ టెక్నీషియన్ గా ఎంపిక అయిన వారికి నెలకు 32670/- రూపాయలు జీతం లభిస్తుంది.
- ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ & శానిటరీ అటెండెంట్ కం వాచ్మెన్ , లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ గా ఎంపిక అయిన వారికి నెలకు 15,000 రూపాయలు జీతం లభిస్తుంది.
- డేటా ఎంట్రీ ఆపరేటర్ గా ఎంపిక అయిన వారికి 18450/- రూపాయల నెల జీతం లభిస్తుంది.
- ఫార్మాసిస్ట్ గా ఎంపిక అయిన వారికి నెలకు 23393/- రూపాయల జీతం లభిస్తుంది.
🔥 ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ : 22/12/2025
- దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 31/12/2025 సాయంత్రం 05:00 గంటల వరకు.
👉 Click here for Notification & Application – 1
👉 Click here for Notification & Application – 2
👉 Click here for official website
