ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు శుభవార్త ! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయబోతున్న “అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్” పథకం ఈ నెల లోనే అమలు చేయనుంది.
ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.
“అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్” పథకానికి సంబంధించి ఎవరు అర్హులు ? ఈ పథకానికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి వంటి అన్ని అంశాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
🔥 అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం అంటే ఏమిటి? :
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సొంత వ్యవసాయ భూమి కలిగి వున్న రైతు కుటుంబానికి అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం (భారత ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారా ఇచ్చే 6,000/- రూపాయల తో కలిపి) ఇచ్చేందుకు గాను ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.
🔥 ఈ పథకానికి అవసరమగు అర్హతలు :
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యవసాయ భూమి కలిగి వున్న రైతు కుటుంబాలు ఈ పథకానికి అర్హత కలిగి ఉంటారు.
- భూమి పరిమాణం తో సంబంధం లేకుండా వ్యవసాయ రైతు కుటుంబాలు అన్నిటికీ ఈ పథకం లభిస్తుంది.
- ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులకు జాయింట్ ల్యాండ్ హోల్డింగ్ కలిగి ఉంటే, ఆ కుటుంబం లో అత్యధిక భూమిని కలిగి వున్న వ్యక్తి బ్యాంకు ఖాతాకు లబ్ది చేకూరుతుంది.
- ఒకే కుటుంబానికి చెందని వారికి , అర్హత కలిగి ఉంటే కుటుంబ సర్వే ఆధారంగా ఇద్దరికీ లబ్ది చేకూరుతుంది.
- ఇద్దరు లేదా ఎక్కువ మందికి ఒకే విధంగా సాగు భూమి కలిగి ఉంటే , ఆ కుటుంబంలో పెద్ద వారికి లబ్ది చేకూరుతుంది.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 అవసరమగు ధ్రువపత్రాలు :
- 1B లేదా పట్టదార్ పాస్ బుక్
- ఆధార్ కార్డు
- ఆధార్ కి లింక్ చేయబడ్డ మొబైల్ నెంబర్.
🔥 వెరిఫికేషన్ చేయి విధానం :
- ముందుగా రైతు సేవా కేంద్రాలు లోని VAA / VHA / VSA వారు అన్నదాత సుఖీభవ పోర్టల్ లో రైతుల యొక్క సమాచారాన్ని వెరిఫై చేస్తారు.
- VAA / VHA / VSA వారు verify చేసిన డేటా ను మండల వ్యవసాయ అధికారి (MAO) అప్రూవ్ చేయవలసి వుంటుంది.
- చనిపోయిన వారు ఎవరైనా ఉంటే రిజెక్ట్ చేస్తారు.
🔥 ఈ క్రింది వారికి ఈ పథకం వర్తించదు !: కుటుంబంలో ఈ క్రింది వారు ఉంటే వారికి ఈ పథకం వర్తించదు.
- రాజ్యాంగ బద్ద పదవులలో ఉన్న వారు
- ప్రస్తుత / పూర్వ మంత్రులు, M.P లు, MLA లు, MLC లు, మేయర్లు, ZP చైర్ పర్సన్ లు,
- వివిధ డిపార్ట్మెంట్ లో పనిచేసిన ప్రభుత్వ , ప్రభుత్వ రంగ ఉద్యోగులు, మాజీ ఉద్యోగులు
- 10,000/- రూపాయలకు పైగా పెన్షన్ లభిస్తున్న రిటైర్డ్ పెన్షనర్లు, సూపర్ అనిటెడ్ పెన్షనర్లు.
- క్రిందటి అసెస్మెంట్ సంవత్సరం లో ఇన్కమ్ టాక్స్ చెల్లించిన వారు
- డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, చార్టర్ అకౌంటెంట్లు, ఆర్కిటెక్చర్ వంటి నిపుణులు
- వ్యవసాయ భామిని వ్యవసాయేతర భూమి గా అనగా ఇంటి స్థలం, ఆక్వా కల్చర్ గా ఉపయోగిస్తున్నవారు.
- గ్రామ స్థాయి వ్యవసాయ మరియు రెవెన్యూ అధికారులు అనర్హులు ను గుర్తించేందుకు గాను గ్రౌండ్ త్రూతింగ్ నిర్వహిస్తారు.
🔥 ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ?:
- అర్హత గల వారు రైతు సేవా కేంద్రాలలో ఉన్న అగ్రికల్చరల్ అసిస్టెంట్ లేదా హార్టికల్చర్ అసిస్టెంట్ వారిని సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు.
🔥 చివరి తేదీ :
- రైతులు లేదా లబ్దిదారుల యొక్క డేటా ను 20/05/2025 ను చివరి తేదీగా వెరిఫై చేసేందుకు గాను ఫీల్డ్ స్టాఫ్ కు సూచనలు జారీ చేస్తూ ఆదేశాలు జారీ చేయబడ్డాయి.
👉 Click here to check for scheme eligibility
సంబంధిత సమాచారాన్ని మీకు తెలిసిన వారికి మన ఆర్టికల్ ద్వారా షేర్ చేసి, ఉపయోగపడే విధంగా చేస్తారని ఆశిస్తున్నాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుతం పథకాలు & సర్వీసులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు వంటి వివరాలు కొరకు మన పేజీ ను ఫాలో అవ్వగలరు.