ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష కోసం వెయిట్ చేస్తున్న అభ్యర్థులకు సంబంధించి స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్, ఆంధ్రప్రదేశ్ వారు జూన్ 1వ తేదీ నాడు నిర్వహించే కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష మరియు హాల్ టికెట్స్ విడుదల చేసింది.
🔥 AP పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షల హాల్ టికెట్స్ విడుదల (AP Police Constable Mains Hall Tickets) :
- జూన్ 1వ తేదీన నిర్వహించబోయే కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షల హాల్ టికెట్లను 23.05.2025 సాయంత్రం ఐదు గంటల నుంచి అభ్యర్థులు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్సైట్లో లింక్ ఆక్టివేట్ చేసింది.
- అభ్యర్థులు హాల్ టిక్కెట్ ను డౌన్లోడ్ చేసుకొనేందుకు గాను 23.05.2025 సాయంత్రం 05:00 గంటల నుండి 31.05.2025 వరకు అవకాశం ఉంటుంది.
🔥 ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ హాల్ టికెట్స్ ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోండి :
- అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుండి హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- అధికారిక వెబ్సైట్ లో అభ్యర్థి రిజిస్ట్రేషన్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు నమోదు చేసి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి.
- 23.05.2025 సాయంత్రం 05:00 గంటల నుండి హాల్ టికెట్ లు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు.
- హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం లో ఏమైనా సమస్యలు ఎదురైతే హెల్ప్ లైన్ నెంబర్ 9441450639 లేదా 9100203323 కు లేదా mail-slprb@gov.in కు సంప్రదించవచ్చు.
🔥 రాష్ట్రంలోని 5 జిల్లాలలో మెయిన్స్ పరీక్ష నిర్వహణ :
- ఆంధ్రప్రదేశ్ లోని 5 జిల్లాలలో గల కేంద్రాలలో మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తున్నారు.
- విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతి జిల్లాలో పరీక్ష నిర్వహిస్తారు.
- 01.06.2025 న ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 PM వరకు పరీక్ష జరుగుతుంది.
- ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ ఆధారిత వ్రాత పరీక్ష.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం , ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు ద్వారా ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ను 2022 లో విడుదల చేసింది.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
- మొత్తం 6,100 ఉద్యోగాలను భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
🏹 Download Hall Tickets – Click here
👉 Click here for official website