ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు ఈరోజు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు “X” వేదికగా విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ గారు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సంవత్సరం పదో తరగతి పరీక్షలకు 6,14,459 మంది విద్యార్థులు హాజరయ్యారు. 4,95,585 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
పరీక్ష రాసిన విద్యార్థుల్లో 81.14% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది.. పార్వతీపురం మన్యం జిల్లాలో అత్యధికంగా 93.90% విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 1680 పాఠశాలలు 100% ఫలితాలు సాధించాయి.
పరీక్ష ఫలితాలను విద్యార్థులు & తల్లితండ్రులు సులభంగా పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మన మిత్ర వాట్సాప్ సర్వీస్ ద్వారా తెలుసుకోవచ్చు.

అధికారిక వెబ్సైట్ ద్వారా పదో తరగతి ఫలితాలు :
పాఠశాల విద్యాశాఖ యొక్క అధికారిక వెబ్సైట్ లో విద్యార్థి హాల్ టికెట్ నెంబర్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
వాట్సాప్ ద్వారా పదో తరగతి ఫలితాలు :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన మన మిత్ర వాట్సాప్ నెంబర్ ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు. వాట్సాప్ నెంబర్ 9552300009 కి ” Hi ” అని మెసేజ్ పంపించి , పదో తరగతి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా రిజల్ట్స్ సులభంగా తెలుసుకోవచ్చు.
రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కు అవకాశం :
విద్యార్థులు రీ వెరిఫికేషన్ మరియు రీకౌంటింగ్ కు ఏప్రిల్ 24 ఉదయం 10 గంటల నుండి మే ఒకటి రాత్రి 11 గంటల వరకు అప్లై చేయవచ్చు.
రీ కౌంటింగ్ కు ఒక్కో పేపర్ కు 500/- రూపాయలు, రీ వెరిఫికేషన్ కు ఒక్కో పేపర్ కు 1000/- రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
సప్లమెంటరీ పరీక్షల తేదీలు :
మే 19వ తేదీ నుండి 28వ తేదీ మధ్య సప్లమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు.
👉 Official Website – Click here