AP ICET – 2025 Results :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్-2025 ఫలితాలను మంత్రి నారా లోకేష్ గారు “X” వేదికగా విడుదల చేశారు. 95.86% మంది ఉత్తీర్ణులైనట్టు మంత్రిగారు ప్రకటించారు.
AP ICET – 2025 ఎంతమంది ఉత్తీర్ణులయ్యారు ?
AP ఐసెట్ పరీక్షకు 34,131 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 32,719 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అంటే 95.86% ఉత్తీర్ణత నమోదయింది. ఫలితాలు విడుదల చేసిన సందర్భంగా మంత్రి నారా లోకేష్ గారు ఐసెట్ లో ఉత్తీర్ణులైన వారికి అభినందనలు తెలిపారు.
AP ICET ఫలితాలు ఇలా చూడండి :
పరీక్ష రాసిన వారు తమ ఫలితాలను క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు హాల్ టికెట్ నెంబర్ వివరాలు నమోదు చేసి తమర్యాంకు తెలుసుకోవచ్చు.