AP నిరుద్యోగులకు శుభవార్త చెప్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ.. వివరాలు ఇవే.. | AP Government Latest News

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. యూనిఫామ్ మరియు నాన్ యూనిఫామ్ ఉద్యోగాలకు వయోపరిమితిని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

నాన్ యూనిఫామ్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వయస్సు 34 సంవత్సరాలు నుండి 42 సంవత్సరాలు వరకు పెంచుతూ గతంలో ఇచ్చిన ఉత్తర్వుల గడువు తేదీని సెప్టెంబర్ 30వ తేదీ వరకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. 2023 సంవత్సరం అక్టోబర్ లో ఇచ్చిన ఉత్తర్వులు ప్రకారం వయోపరిమితి పెంపు గడువు 2024 సెప్టెంబర్ 30తో ముగిసింది. తాజాగా విడుదల చేసిన ఉత్తర్వులు ద్వారా 2025 సెప్టెంబర్ 30 వరకు వయోపరిమితి పెంచారు. 

అంతేకాకుండా యూనిఫామ్ ఉద్యోగాలకు క్యాటగిరీలు వారిగా నిర్ణయించిన వయసుకు అదనంగా మరో రెండేళ్లు గడువు పెంపు అమలు సెప్టెంబర్ 30 వరకు వర్తిస్తుందని తెలియజేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేశారు.

🏹 గ్రామీణ విద్యుత్ సంస్థల్లో ఫీల్డ్ సూపర్వైజర్ ఉద్యోగాలు – Click here 

ప్రతీ రోజూ ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం What’s App / Telegram లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

యూనిఫామ్ మరియు నాన్ యూనిఫామ్ ఉద్యోగాలు భర్తీ కోసం ప్రభుత్వం నుండి లేదా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి లేదా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి వచ్చే నోటిఫికేషన్స్ కు ఈ వయోపరిమితి పెంపు వర్తిస్తుంది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు వయోపరిమితి పెంపు ఒక మంచి శుభవార్తగా చెప్పవచ్చు. 

నోటిఫికేషన్స్ విడుదల చేసిన సమయంలో నిబంధనల ప్రకారం రిజర్వేషన్ల వారీగా వయస్సులో సడలింపు కూడా అదనంగా ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!