Andhra Pradesh Academic Instructors Jobs Vacancies List : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖలో 1146 అకాడమిక్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం రాష్ట్రంలోని 26 జిల్లాల్లో పాఠశాలల్లో ఖాళీగా ఉన్న స్కూల్ అసిస్టెంట్ మరియు ఎస్జీటీ ఉద్యోగాలను తాత్కాలిక పద్ధతిలో ఐదు నెలల కాలానికి భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు డిసెంబర్ 5వ తేదీలకు అప్లై చేయాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు డిసెంబర్ 8వ తేదీ నుండి 08-05-2025 వరకు పని చేయాల్సి ఉంటుంది.
రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. ఆర్టికల్ చివరిలో పోస్టులు భర్తీ కోసం ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు, అన్ని జిల్లాల్లో ఉన్న ఖాళీలు వివరాలు మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్స్ ఇవ్వబడినవి.
పోస్టులు భర్తీ చేస్తున్న సంస్థ :
ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా శాఖ ఈ ఉద్యోగాలకు భర్తీ చేస్తుంది..
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇందులో స్కూల్ అసిస్టెంట్ మరియు SGT పోస్టులు భర్తీ చేస్తున్నారు.
మొత్తం పోస్టులు :
మొత్తం 1146 పోస్ట్లు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
అప్లికేషన్ తేదీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు డిసెంబర్ మూడవ తేదీ నుండి డిసెంబర్ 5వ తేదీలోపు అప్లై చేయాలి.
జాయినింగ్ తేదీ :
అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ గా ఎంపికైన వారు డిసెంబర్ 8వ తేదీ నుండి విధుల్లో జాయిన్ అవ్వాలి.
జీతము వివరాలు :
- స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 12,000/- జీతము ఇస్తారు.
- SGT ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 10,000/- జీతము ఇస్తారు.
▶️ Download Vacancies List & Application – Click here
