పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ విద్యార్హతలతో విమానాశ్రయాల్లో ఉద్యోగాలు – Airport jobs భర్తీకి IGI Aviation Services అనే సంస్థ నుండి ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది.
తాజాగా విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాప్ మరియు లోడర్స్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
Airport Jobs నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- IGI Aviation Services అనే సంస్థ ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసింది.
Airport Jobs కు ఉండవలసిన విద్యార్హతలు :
- తాజాగా విడుదల చేయబడిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాప్ ఉద్యోగాలకు 12వ తరగతి ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవచ్చు. ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాప్ ఉద్యోగాలకు మహిళలు మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
- లోడర్స్ ఉద్యోగాలకు పదో తరగతి పాస్ అయిన వారు అర్హులు. లోడర్స్ ఉద్యోగాలకు పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు.

వయస్సు వివరాలు :
- ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాప్ ఉద్యోగాలకు 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు.
- లోడర్స్ ఉద్యోగాలకు 20 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు.
మొత్తం ఖాళీల సంఖ్య :
- ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1446 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఇందులో ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ ఉద్యోగాలు 1017 మరియు లోడర్స్ ఉద్యోగాలు 429 ఉన్నాయి.
అప్లై చేయు విధానం :
- ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
ఎంపిక విధానం :
- ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ ఉద్యోగాలకు పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
- లోడర్స్ ఉద్యోగాలకు పరీక్ష మాత్రమే ఉంటుంది.
జీతము వివరాలు :
- ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 25,000/- నుండి 35,000/- వరకు జీతం ఇస్తారు.
- లోడర్స్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 15,000/- నుండి 25,000/- వరకు జీతం ఇస్తారు.
పరీక్షా విధానం వివరాలు :
- పరీక్షలో మొత్తం 100 మల్టిపుల్ ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇస్తారు.
- జనరల్ అవేర్నెస్, ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, ఇంగ్లీష్ నాలెడ్జ్, ఏవియేషన్ నాలెడ్జ్ సబ్జెక్టుల నుండి 25 ప్రశ్నల చొప్పున మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు.
- ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు.
- నెగిటివ్ మార్కులు లేవు.
- పరీక్షకు 90 నిమిషాల సమయం ఇస్తారు.
పరీక్ష కేంద్రాలు :
- దేశవ్యాప్తంగా వివిధ పట్టణాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో మరియు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదులో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తారు.
అప్లికేషన్ ఫీజు వివరాలు :
- ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాప్ ఉద్యోగాలకు అప్లికేషన్ ఫీజు 350/- రూపాయలు..
- లోడర్స్ ఉద్యోగాలకు అప్లికేషన్ ఫీజు 250/- రూపాయలు
✅ Official Website – Click here