ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల పబ్లిక్ లైబ్రరీలలో వివిధ కారణాల చేత ఖాళీగా ఉన్న ఉద్యోగాలు లైబ్రేరియన్ గ్రేడ్ – 2, లైబ్రేరియన్ గ్రేడ్ – 3, రికార్డ్ అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్డినేట్లు, వాచ్మెన్ ఉద్యోగాలను ఔట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు అనుమతి కోరుతూ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కు లెటర్ పంపించడం జరిగింది.
ఇందులో పేర్కొన్న పలు ముఖ్య అంశాలు కోసం ఈ ఆర్టికల్లో మీకు తెలియజేయడం జరుగుతుంది.
అభ్యర్థులు ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి, సమాచారాన్ని తెలుసుకోగలరు.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 ఉద్యోగాలు భర్తీ చేయు సంస్థ :
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్ ఈ ఉద్యోగాల భర్తీ చేపట్టనుంది.
🔥 భర్తీ చేయబోవు ఉద్యోగాలు :
- లైబ్రేరియన్ గ్రేడ్ 2
- లైబ్రేరియన్ గ్రేడ్ 3
- రికార్డ్ అసిస్టెంట్లు
- ఆఫీస్ సబార్డినేట్లు
- వాచ్మెన్లు
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
- మొత్తం 976 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో
- లైబ్రేరియన్ గ్రేడ్ 2 – 92
- లైబ్రేరియన్ గ్రేడ్ 3 – 224
- రికార్డ్ అసిస్టెంట్లు – 111
- ఆఫీస్ సబార్డినేట్లు – 421
- వాచ్మెన్లు – 128
🔥 విద్యార్హత :
- లైబ్రేరియన్ గ్రేడ్ 2 & లైబ్రేరియన్ గ్రేడ్ 3 :
- లైబ్రరీ సైన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి.
- రికార్డ్ అసిస్టెంట్లు: ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి.
- ఆఫీస్ సబార్డినేట్లు & వాచ్మెన్లు :
- 7వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారికి ఆఫీస్ సబార్డినేట్ & వాచ్ మెన్ గా అవకాశం కల్పించవచ్చు.
నోట్: విద్యార్హతలు సంబంధిత నోటిఫికేషన్ లో కచ్చితంగా ప్రస్తావిస్తారు.ప్రస్తుతం ఆర్టికల్ లో పేర్కొన్న విద్యార్హతలు కేవలం అభ్యర్థి అవగాహన మేరకు మాత్రమే తెలియపరచడం అయినది.
🔥 లైబ్రరీలలో ఇన్ని ఖాళీలు ఎలా ఉన్నాయి? :
- పబ్లిక్ లైబ్రరీలలో ఉద్యోగాలు చేస్తున్న వారు రిటైర్ కావడం, ప్రమోషన్స్ రావడం,కొంత మంది ఉద్యోగులు రిజైన్ చేయడం తో పాటు వివిధ ఇతర కారణాల వలన చాలా కాలం పాటు ఖాళీగా ఉన్నాయి
- అనుకోని కారణాల వలన ఈ ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయకపోవడం తో ప్రస్తుత సిబ్బంది పై అదనపు భారం పడుతుంది.
- అందుచేత ఈ భారీ ఖాళీలను ఒకే సారి భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
🔥 ఏ విధంగా భర్తీ చేయనున్నారు? :
- ఈ ఉద్యోగాలను రెగ్యులర్ ప్రాధిపతికన భర్తీ చేసేంతవరకు అవుట్సోర్సింగ్ ప్రాధిపతికన భర్తీ చేయనున్నారు.