APSRTC లో 7,545 ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న RTC చైర్మన్ | APSRTC Upcoming Jobs Recruitment 2024 | APSRTC Driver, Conductor, Junior Assistant, Trafic Supervisor etc Vacancies

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్ (APSRTC)లో భారీగా ఉద్యోగాల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

  1. APSRTC లో 7 వేల ఉద్యోగాలకు పైగా భర్తీకి త్వరలో చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ ఛైర్మన్‌ కొనకళ్ల నారాయణరావు తాజాగా ఒక ప్రకటనలో తెలిపారు. 
  2. ఇటీవల ఒక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ఉద్యోగాల భర్తీపై కొన్ని వివరాలు వెల్లడించారు. 
  3. ఆర్టీసీ చైర్మన్ తెలిపిన వివరాలు మరియు ఇటీవల APSRTC ప్రభుత్వానికి పంపిన నివేదిక ప్రకారం ఆర్టీసీ లో ఖాళీల సమాచారం క్రింది విధంగా ఉంది.

ఇలాంటి మరి కొన్ని ఉద్యోగాల సమాచారం కోసం క్రింద ఇచ్చిన లింక్స్ పైన క్లిక్ చేసి మా WhatsApp మరియు Telegram Group’s లో జాయిన్  అవ్వండి.

▶️ మరి కొన్ని రకాల ఉద్యోగాల సమాచారం 👇 👇 👇 

🏹 పదో తరగతి అర్హతతో పోస్టల్ శాఖలో ఉద్యోగాలు భర్తీ – Click here 

 🏹 IDBI బ్యాంక్ లో 600 ఉద్యోగాలను భర్తీ  – Click here 

  1. ఈ వివరాలు ప్రకారం ఆర్టీసీలో మొత్తం 7,545 పోస్టులు భర్తీ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆర్టీసీలో ఉన్న ఖాళీలపై వివరాలను ప్రభుత్వానికి APSRTC సమర్పించింది. 
  2. మొత్తం 18 కేటగిరిల్లో 7,545 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆ నివేదికలో వెల్లడించింది.
  3. దీనికి సంబంధించిన నియామక ప్రక్రియ త్వరలోనే ప్రారంభంకానుంది.
  4. కేటగిరీల వారీగా ఖాళీల వివరాలు చూస్తే.. 
  • డ్రైవర్ పోస్టులు – 3,673, 
  • కండక్టర్ పోస్టులు – 1,813,
  • జూనియర్ అసిస్టెంట్ పోస్టులు – 656
  • అసిస్టెంట్ మెకానిక్‌, శ్రామిక్ పోస్టులు – 579
  • ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ పోస్టులు –  207
  • మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులు – 179
  • డిప్యూటీ సూపరింటెండెంట్ పోస్టులు – 280 
  1. కొద్దిరోజుల క్రితం పై పోస్టులకు అనుమతి కోరుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రభుత్వానికి ఒక నివేదిక పంపింది. 
  2. ప్రభుత్వం నుంచి పూర్తి అనుమతి వచ్చిన తర్వాత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ విడుదల చేసే అవకాశం ఉంది.
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *